Lucknow, SEP 29: అధికారులు అంటే అందరూ కఠినంగానే ఉండరు. చాలా మంది మనుసుతో ఆలోచించి పనిచేసేవాళ్లు కూడా ఉంటారు. ఇక మహిళల విషయానికి వస్తే వాళ్లు మరింత సున్నితంగా ఉంటారు. పెద్ద హోదాలో ఉన్నప్పటికీ...వారిలోని మాతృత్వం, సున్నితత్వం అప్పడప్పుడూ బయట పడుతుంటాయి. అలాంటి ఘటనే యూపీలో (UP) జరిగింది. ప్రమాదంలో గాయ‌ప‌డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారిని చూసి ఐఏఎస్ ఆఫీస‌ర్ బోరున విల‌పించారు. గురువారం రాత్రి ఉత్తర‌ప్రదేశ్‌లోని ల‌ఖింపూర్‌ఖేరిలో (Lakhimpur Kheri) బ‌స్సు – ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెంద‌గా, మ‌రో 41 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని లఖింపూర్ ఖేరీ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. అక్కడ పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చిన లక్నో డివిజనల్ ( Lucknow Divisional Commissioner) కమిషనర్ రోషన్ జాకబ్ (Roshan Jacob)...అందరినీ పరామర్శించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళ తన కుమారుడికి సరైన సాయం అందడం లేదని ఫిర్యాదు చేసింది.

దాంతో ఆ విషయంపై వెంటనే స్పందించి...బాలుడ్ని చూసేందుకు వెళ్లారు. గోడ కూలిన ఘటనలో గాయపడ్డ బాలుడి పరిస్థితిని చూసి చలించింది. బోర్లా పడుకొని నరకయాతన పడుతున్న బాలుడ్ని అక్కడి డాక్టర్లు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు విని ఫైరయ్యారు. అతని పరిస్థితి ఏంటని డాక్టర్లను వాకబు చేశారు రోషన్ జాకబ్ (Roshan Jacob).  అయితే డాక్టర్లు నీళ్లు నమలడంతోవారితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడికి ఫ్యాక్చర్ అయి ఉంటుందని, అందుకే కదల్లేకపోతున్నాడని కన్నీరు పెట్టుకున్నారు.

Uttar Pradesh: వీడికి ఇదేం పోయేకాలం, 11000 వోల్ట్ హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడుకుని స్టంట్లు చేసిన యువకుడు, నెట్టింట్లో వీడియో వైరల్ 

బాలుడి పరిస్థితి చూసి తనలోని మాతృహృదయం వెంటనే స్పందించింది. అతన్ని అక్కున చేర్చుకొని ఓదార్చింది. గాయపడ్డ బాలుడికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాల‌ని ఆమె ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.