ఉత్తర ప్రదేశ్‌లోని అమారియా నగరానికి(Amaria town) చెందిన నౌషాద్ అనే వ్యక్తి 11000 వోల్ట్ హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడుకుని.. వేలాడుతూ.. నడుస్తూ ప్రమాదభరిత స్టంట్లు చేశాడు. అది చూసి అక్కడున్న వారంతా భయంతో విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి.. విషయాన్ని వివరించారు. అనంతరం విద్యుత్ తీగలపై నుంచి కిందకు రావాలని నౌషాద్‌ను కోరారు.
అతడు ఎంతకూ వినకపోవడంతో భవనంపైకి ఎక్కి.. అతడిని కిందకి దించేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు నౌషాద్.. విద్యుత్ వైర్లను వీడాడు. కొద్ది రోజుల క్రితం నౌషాద్ జాబ్ పోయిందని.. అప్పటి నుంచి అతడి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా(Viral in Social Media) మారింది.
Pilibhit black Amriya me man 11000 volt light ke tar pe for losing his job pic.twitter.com/Rwtq6N1mmI
— Irshad Khan (@IrshadK54670394) September 26, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)