Karnataka, AUG 20: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగానికి (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కు) సంబంధించిన డ్రోన్ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్-UAV) ఒకటి ఆదివారం ఉదయం కుప్పకూలింది. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రోన్‌పై TAPAS-07A-14 నంబర్ ఉంది. ఒక్కసారిగా పంట పొలాల్లో డ్రోన్ కుప్పకూలడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, డీఆర్‌డీవో (DRDO) అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
#WATCH | A Tapas drone being developed by the DRDO crashed today during a trial flight in a village of Chitradurga district, Karnataka. DRDO is briefing the Defence Ministry about the mishap and an inquiry is being carried out into the specific reasons behind the crash: Defence… pic.twitter.com/5YSfJHPxTw
— ANI (@ANI) August 20, 2023
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనలో డ్రోన్ (Drone Crash) పూర్తిగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.