MIG-27: పాక్‌ను హడలెత్తించిన యుద్ధ విమానాలకు ఘనమైన వీడ్కోలు, కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన మిగ్-27, మూడు దశాబ్దాల పాటు సేవలు, వాటికి ఆర్మీ పెట్టిన ముద్దు పేర్లు ఓ సారి తెలుసుకోండి
MiG 27 to pass into history, its last squadron to be decommissioned in Jodhpur

Jodhpur, December 28: భారత వాయుసేనలో అతి శక్తిమంతమైన మిగ్‌-27 యుద్ధవిమానం (MIG-27) చరిత్ర పుటలకెక్కింది. మూడు దశాబ్దాలకు పైగా చెరగని సేవలందించిన ఈ లోహ విహంగాలకు ఐఏఎఫ్‌(IAF) ఘన వీడ్కోలు పలికింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ (JODHPUR)వైమానిక స్థావరం నుంచి ఏడు మిగ్‌ -27 విమానాలు చివరిసారి గగనవిహారం చేశాయి. చివరిసారిగా నింగికెగిరిన ఈ విమానాలకు ల్యాండింగ్‌ అయిన తర్వాత జల ఫిరంగుల ద్వారా గౌరవ వందనం సమర్పించారు.

1999 నాటి కార్గిల్‌ యుద్ధంలో (1999 Kargil war)సత్తా చాటిన ఈ లోహ విహంగాలను భారత వైమానిక దళంలో బహుదుర్‌గా(Bahadur) వ్యవహరిస్తారు. ఈ వీడ్కోలుతో ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధవిమానాల ప్రస్థానానికి ముగింపు పడింది. ప్రస్తుతం ఏ దేశంలోనూ ఇవి వినియోగంలో లేవు. మిగ్‌ వీడ్కోలు కార్యక్రమంలో సౌత్‌ వెస్ట్రన్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌కే ఘోటియా పాల్గొన్నారు. ఈ విమానాలు పోరాటక్షేత్రంలో ముందు నిలిచాయని, 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో అమూల్యమైన సేవలందించాయని తెలిపారు. ఇన్నాళ్లూ జోథ్‌పూర్‌ ఎయిర్‌ బేస్‌లో మిగ్‌–27 రకం విమానాలు ఏడు వరకు సేవలందించాయి.

Here's Indian Air Force Tweet

స్క్వాడ్రన్​ స్కార్పియన్​29లోని మొత్తం 7 విమానాలనూ ఐఏఎఫ్​ డీకమిషన్​ చేసింది. అంతకుముందు 2017లో మరో రెండు స్క్వాడ్రన్లకు చెందిన మిగ్​27 విమానాలూ రిటైర్​ అయిపోయాయి. పశ్చిమబెంగాల్​లోని హషిమర ఎయిర్​బేస్​లో ఇవి రెస్ట్​ తీసుకుంటున్నాయి.

ఇటీవల కాలంలో ఈ యుద్ధ విమానాల పనితీరు అధికారులను అంతగా సంతృప్తి పరచడం లేదని, మిగ్ -27 విమానాలు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఇకపై రష్యా నుంచి ఎలాంటి యుద్ధ విమానాలు కొనుగోలు చేయవద్దని, రష్యా నుంచి దిగుమతి చేసిన మిగ్‌లు సరిగా పని చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసర సమయంలో ఇప్పటివరకూ చాలా యుద్ధ విమానాలు కుప్పకూలిపోయాయని అధికారుల చెపుతున్నారు.

Indian Air Force Tweet

ఐఏఎఫ్​లోకి మిగ్​27 విమానాలు 1985లో ఎంటరయ్యాయి. దేశ యుద్ధ సామర్థ్యాన్ని మరో ఎత్తుకు తీసుకెళుతూ.. కార్గిల్​ యుద్ధంలో పాక్​ సైన్యానికి ముచ్చెమటలు పట్టించాయి. శత్రు స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేయగల నైపుణ్యం వీటిసొంతం. ఆపరేషన్​ సఫేద్​​ సాగర్​లో భాగంగా పాక్​ సైనికులను తరిమికొట్టాయి. కార్గిల్​ యుద్ధ గెలుపులో ముఖ్య పాత్ర పోషించాయి.

మిగ్​27 యుద్ధ విమానాలను రష్యా (సోవియట్​ యూనియన్​) తయారు చేసింది. సింగిల్​ ఇంజన్​, సింగిల్​ సీటర్​ వ్యూహాత్మక ఫైటర్​ ఇది. రష్యా నుంచి కొనుగోలు చేసినా తర్వాతి కాలంలో హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ (హాల్​) ఆధ్వర్యంలో ఇండియాలోనే అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. గంటకు 1,885 కిలోమీటర్ల వేగంతో (మాక్​1.6 – సౌండుకు ఒకటిన్నర రెట్ల వేగం) దూసుకెళ్లడం దీని స్పెషాలిటీ. రోటరీ ఇంటిగ్రల్​ కెనాన్​ ఇందులో ఇన్​బిల్ట్​గా ఉంటుంది. ఇక, బయటి నుంచి 4 వేల కిలోల దాకా యుద్ధ సామగ్రిని మోసుకెళ్లగల సత్తా దీని సొంతం.

అయితే ఈ మధ్య వీటి పనితీరుపై నిరాశాకర ఫలితాలు వచ్చాయి. మామూలు ఆపరేషన్లలో సైతం ఇవి అంతగా పనితీరును కనపరచలేదని తెలుస్తోంది. 482 మిగ్​27లు ప్రమాదాలకు గురయ్యాయని 2012లో నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పార్లమెంట్​లో స్వయంగా వెల్లడించారు కూడా. విమానంలోని ఆర్​29 ఇంజన్లలోని లోపం వల్లే అవి తరచూ కూలుతున్నాయన్నది నిపుణులు చెబుతున్నారు.

అవి తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో 2010 ఫిబ్రవరిలో దాదాపు 150 యుద్ధ విమానాలను మూలకు పెట్టేశారు. ఆ తర్వాతా కొన్ని ఆపరేషన్లు చేసినా మళ్లీ ప్రమాదాలు మామూలు అయిపోవడంతో 2017 డిసెంబర్​లో రెండు స్క్వాడ్రన్న మిగ్​ 27ఎంఎల్​ విమానాలను ఐఏఎఫ్ రిటైర్​ చేసేసింది . మొత్తం 165 విమానాలుండగా, 150 విమానాలు పోను 15 మిగిలాయి. వాటిలోనూ మూడు ప్రమాదాల్లో పాడైపోవడంతో మిగిలినవి 12. ఇప్పుడు ఆ విమానాలన్నీ రిటైర్​ అయిపోతున్నాయి.

అయితే మిగిలిన విమానాలను ఏం చేస్తారన్నదానిపైనే ఆసక్తి ఉంది. ఇప్పటికైతే దాని గురించి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని రక్షణ శాఖ ప్రతినిధి కర్నల్​ సంబిత్​ ఘోష్​ (Colonel Ghosh)చెప్పారు. వాటిని ఎయిర్​బేస్​ లేదా డిపోల్లో గుర్తుగా దాచిపెట్టే అవకాశం ఉందంటున్నారు. లేదంటే వేరే దేశాలకైనా ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. అంతేగాకుండా ఇంట్రెస్ట్​ చూపించే సంస్థలకు వాటినిచ్చే యోచనలోనూ ఉన్నట్టు ఎయిర్​ఫోర్స్​ వర్గాల ద్వారా తెలుస్తోంది.

వీటికి పైలట్లు పెట్టిన ముద్దుపేర్లు

బహదూర్​: 1999 కార్గిల్​ యుద్ధం టైంలో దాన్ని నడిపిన ఐఏఎఫ్​ పైలట్లు దానికి పెట్టిన ముద్దు పేరు ఇది. బహదూర్​ అంటే ధైర్యశాలి అని అర్థం.

బాల్కన్​: అంటే బాల్కనీ అని అర్థం. కాక్​పిట్​లో నుంచి చుట్టుపక్కలా కచ్చితత్వమైన వ్యూ ఉండడంతో టెస్ట్​ పైలట్లు దానికి ఆ పేరు పెట్టారు.