Balasore, June 02: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Train Accident) మృతులకు ఒడిశా ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా(Ex gratia) ప్రకటించింది. గాయపడ్డవాళ్లకు రూ.2 లక్షలు ఇవ్వనుంది. ఈ ఘటనలో గాయపడిన 350మందిలో 50 మందికి పైగా మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(Naveen Patnaik) కంట్రోల్ రూమ్‌కు వెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రాణ భయంతో కొందరు బోగీలో చిక్కుకున్నారని, దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
Odisha train accident | Union Railways Minister Ashwini Vaishnaw announces ex-gratia compensation of Rs 10 lakhs in case of death of accident victims and Rs 2 lakhs for those with grievous injuries and Rs 50,000 for those with minor injuries. pic.twitter.com/Pr7ddxoVi4
— ANI (@ANI) June 2, 2023
ఈ ఘటన జరిగిన కాసేపటికే మరో రైలు కూడా ఇక్కడే ప్రమాదానికి గురైనట్టు ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా వెల్లడించాడు. పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆ పక్కనే వెళ్తున్న యశ్వంతపూర్ – ఐరా ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. దాంతో, అందులోని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించేందుకు 50 అంబులెన్స్‌లు సరిపోకపోవడంతో.. బస్సులను ఏర్పాటు చేశారు.