Bangalore, SEP 21: క‌ర్నాట‌క‌లో (Karnataka) బీజేపీ అవినీతి పాల‌న‌పై 40 ప‌ర్సెంట్ స‌ర్కార్ (40% sarkar) అంటూ ప్రచారోద్యమం చేపట్టిన కాంగ్రెస్ మ‌రింత దూకుడు పెంచింది. సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై (Basavraj Bommai) ఫోటో, క్యూఆర్‌కోడ్‌తో “పేసీఎం”(PAYCM) అని ముద్రించిన పోస్టర్లను కాంగ్రెస్ బెంగ‌ళూర్ సిటీ (Bangalore) అంత‌టా ఏర్పాటు చేసింది. క్యూఆర్ కోడ్ స్కాన్ (QR Code)చేయ‌గానే యూజ‌ర్లను బీజేపీ అవినీతి పాల‌న‌పై ఫిర్యాదులు చేసేందుకు కాంగ్రెస్ ఇటీవ‌ల ఏర్పాటు చేసిన 40ప‌ర్సెంట్ స‌ర్కార వెబ్‌సైట్‌కు తీసుకువెళ్లేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుత‌ బీజేపీ (BJP) హ‌యాంలో ఏ ప‌ని జ‌ర‌గాల‌న్న 40 శాతం కమిష‌న్ ముట్టజెప్పాల‌నే తీరును పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ ఈ పోస్టర్లను ఏర్పాటు చేసింది.

బీజేపీ అవినీతి పాల‌న‌పై గ‌త వారం కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేప‌ట్టింది. అవినీతి పాల‌నపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ లాంఛ్ చేసింది. బీజేపీ ప్రభుత్వం లూటీదారులు, స్కామ్‌స్టర్‌లతో నిండిపోయింద‌ని క‌ర్నాట‌క కాంగ్రెస్ నేత సిద్ధరామ‌య్య ఆరోపించారు. కాషాయ స‌ర్కార్ అవినీతిపై తాము ప్రశ్నిస్తూనే ఉంటామ‌ని కాంగ్రెస్ స్పష్టం చేసింది.