 
                                                                 New Delhi, Mar 11: లోక్‌సభ ఎన్నికల 2024 తేదీలను ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు, ఎన్నికల కమిషనర్‌లలో ఒకరైన అరుణ్ గోయల్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమీషనర్ల సెక్షన్లు 7, 8 (సేవా నియమ నిబంధనలు, కార్యాలయ నిబంధనలు 2023)ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్‌లను నియమించకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని ('Centre Should Not Appoint CEC') సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నేత జయఠాకూర్ (Congress leader Jaya Thakur) ఒక పిటిషన్ దాఖలు చేశారు. 2023 నాటి తీర్పును అనుసరించి ఈ నియామకాలు చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది.ఇందులో ECI సభ్యుల నియామకానికి సంబంధించిన విధానాన్ని నిర్దేశించాయి.
గత నెల ఒక కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయెల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఈ క్రమంలోనే ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు (appointing election commissioner) కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ మార్చి 15లోగా కొత్త కమిషనర్ల పేర్లను ఖరారు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో SBI రిక్వెస్ట్‌ని తిరస్కరించిన సుప్రీంకోర్టు, రేపటిలోగా ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు
ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత జయా ఠాకుర్ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు.ఈసీల నియామకాలపై 2023లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి తాజా నియమకాలు చేపట్టేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ అభ్యర్థించారు.
ఆ తీర్పులో ఏంటంటే.. ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కలిసి సీఈసీ, ఈసీ నియామకాలు చేపట్టాలని 2023 మార్చిలో సుప్రీం తీర్పునిచ్చింది. అయితే, గతేడాది డిసెంబరులో కేంద్రం దీనిపై కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధాని సూచించిన కేంద్రమంత్రిని చేర్చింది.
ఈ కొత్త చట్టాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎంపిక కమిటీలో కేంద్రానికి ఎక్కువ అధికారం ఉంటే.. ఈసీ స్వతంత్రతకు ముప్పు వాటిల్లితుందని ఆరోపించాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై ఏప్రిల్‌లో విచారణ జరగనుంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
