PM Narendra Modi Inaugurates India’s First Underwater Metro in Kolkata: Route, Features, Ticket Price and All You Need to Know (Watch Video)

PM  Modi Inaugurates India’s First Underwater Metro in Kolkata: దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రధాని మోదీ బుధవారం కోల్ కతాలో ప్రారంభించారు. కోల్ కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన రైలు మార్గాన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.120 కోట్ల ఖర్చు చేశారు. కోల్ కతా ఈస్ట్ వెస్ట్ మధ్య 16.6 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించారు.

10.8 కిలోమీటర్లు భూగర్గంలో ఉంది. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ఈ ట‌న్నెల్ (India’s First Underwater Metro) నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌క‌తాలో ర‌వాణా వ్యవ‌స్థ సుల‌భ‌త‌రం కానున్నది. గత ఐదు రోజుల్లో రెండోసారి ప్రధాని మోదీ కోల్ కతా వచ్చారు. రూ.15,400 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు.  భార‌త్ లోనే తొలి అండ‌ర్ వాట‌ర్ మెట్రో రైల్ స‌ర్వీస్, న‌ది లోప‌లే మెట్రో స్టేష‌న్లు, ఏకంగా 11 కిలో మీట‌ర్ల మేర ఉన్న ఈ మార్గం ప్ర‌త్యేక‌త‌లివే!

ఈ అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్‌ ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో (school students) కలిసి ప్రధాని మోదీ తొలిసారి ఈ మెట్రోలో ప్రయాణించారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ మార్గం కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్‌ లేక్‌లను కలుపుతుంది. ఈ మార్గంలో మొత్తం ఆరు స్టేషన్లు ఉండగా మూడు భూగర్భం (జలాంతర్గ)లో ఉన్నాయి. అండ‌ర్‌వాట‌ర్ మెట్రోతో పాటు క‌వి సుభాష్‌- హేమంత ముఖోపాధ్యాయ మెట్రో స్టేష‌న్‌, రూబీ హాల్ క్లినిక్- రాంవాడి మెట్రో మార్గం , త‌ర‌తాలా-మ‌జేర్‌హ‌ట్ మెట్రో సెక్షన్‌ను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. అదేవిధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.

Here's Videos

హౌరా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్‌లో భాగంగా 520 మీటర్ల పొడవు గల ఈ మెట్రో రైలు నదిలో ఈ దూరాన్ని 45 సెకన్లలో పూర్తి చేస్తుంది. మాములుగా అయితే హౌరా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లడానికి 90 నిమిషాల సమయం పడుతోంది.అండర్‌వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ సొరంగాన్ని నదీ గర్భానికి 16 మీటర్ల లోతులో, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో నిర్మించారు. ఈ సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లుగా.. బాహ్య వ్యాసం 6.1 మీటర్లుగా ఉంది.