కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మన్‌ధన్ యోజన అనే పథకాన్ని (Pradhan Mantri Shram Yogi Maandhan Yojana) ప్రవేశపెట్టిన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ పథకం ద్వారా దేశంలోని అసంఘటిత కార్మికులు నెలకు మూడు వేలు పెన్సన్ అందుకోవచ్చు.
వృద్ధాప్యంలో ఉన్న కార్మికులకు ఈ పథకం కింద నెలకు రూ.3,000 పెన్షన్ ఈ పథకం (PMSYM scheme) అందిస్తోంది. అయితే వారికి రూ.15,000 లోపు నెలవారీ ఆదాయం ఉండాలి. అసంఘటిత రంగంలోని కార్మికులైన టైలర్లు, చెప్పులు కుట్టేవాళ్లు, రిక్షా పుల్లర్లు , ఇంటి కార్మికులకు ఈ పథకం ద్వారా 60 ఏళ్ల వరకు రూ. 3 వేలు పెన్సన్ పొందవచ్చు.
ఈ పథకానికి అర్హతలు
దరఖాస్తుదారుడి వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. తప్పనిసరిగా ఆధార్ కార్డ్ , బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారు EPFO, NPS, NSIC సబ్‌స్క్రైబర్లు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి మీ వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.నెలవారీ ఆదాయం రూ. 15,000 కంటే తక్కువ ఉండాలి.
Here's Ministry of Labour Tweets
Get yourself registered on PMSYM by following these steps.@mygovindia @DGLabourWelfare #pmsym #registration #onlineregistration pic.twitter.com/P23XngQwOw
— Ministry of Labour (@LabourMinistry) February 7, 2023
Pradhan Mantri Shram Yogi Maan-dhan (PM-SYM) Scheme is a voluntary and contributory pension scheme for providing monthly minimum assured pension of ₹3000/- on attaining the age of 60 years…
For more details visit https://t.co/GYSRzcVhWX@byadavbjp pic.twitter.com/32rnc7oKWn
— DGLW (@DGLabourWelfare) February 12, 2022
కార్మికుల ఈ పెన్సన్ పొందాలంటే ప్రతి నెలా రూ.55 నుండి రూ. 200 వరకు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో 50 శాతం లబ్ధిదారుడు, 50 శాతం ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది. ఒక వేళ పింఛనుదారుడు మరణిస్తే అతని భార్య లేదా భర్త పెన్షన్ మొత్తాన్ని పొందుతారు.60 ఏళ్ళ వరకు ప్రతి పెన్షనర్ సంవత్సరానికి రూ.36,000 పెన్షన్ పొందుతారు.
ఏప్రిల్ 1 నుంచి ఈ కార్ల అమ్మకాలు బంద్.. కారణం ఏంటి? ఇంతకీ.. ఏయే కార్లు బంద్ కానున్నాయి?
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రెండు రకాలుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మన్‌ధన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫాం నింపిన తరువాత రిజిస్టర్డ్‌మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటిపీని ఎంటర్ చేస్తే చాలు. ఇక ఆఫ్‌లైన్ ద్వారా అయితే కామన్ సర్వీస్ సెంటర్‌లో వివరాలను అందించి దరఖాస్తు చేసుకోవచ్చు