Supreme Court. (Photo Credits: PTI)

Railways Not Liable For Theft Of Passenger's Belongings: ప్రయాణీకుల వ్యక్తిగత వస్తువులను దొంగిలించడం రైల్వేల “సేవా లోపం” కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని ప్రకారం, దొంగిలించబడిన నగదు మొత్తాన్ని ప్రయాణీకులకు తిరిగి చెల్లించాలని రైల్వేని ఆదేశించిన వినియోగదారుల ఫోరం జారీ చేసిన ఉత్తర్వులను జస్టీస్ విక్రమ్ నాథ్ మరియు జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం పక్కన పెట్టింది.

రైల్వే సేవలో ఏదైనా లోపమే దొంగతనం అని ఎలా చెప్పవచ్చో అర్థం చేసుకోవడంలో మేము విఫలమయ్యాము. ప్రయాణికుడు తన సొంత వస్తువులను రక్షించుకోలేకపోతే, రైల్వేలు బాధ్యత వహించలేవు” అని ధర్మాసనం పేర్కొంది.

మిస్టర్ సురేందర్ భోలా (ప్రతివాది/ప్రయాణికుడు”) భారతీయ రైల్వే రైలులో ప్రయాణిస్తుండగా అతని నడుముకు ఉన్న బెల్ట్‌లో రూ. 1 లక్ష నగదు ఉంది. రైలు ప్రయాణంలో ప్రయాణికుడి నుంచి ఈ నగదు చోరీకి గురైంది. రైల్వేస్ నుండి దొంగిలించబడిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ ప్రయాణీకుడు జిల్లా వినియోగదారుల ఫోరం ముందు దావా వేశారు. రైల్వే శాఖ అందించే సేవల లోపం వల్లే డబ్బు చోరీ జరిగిందని వాదించారు.

మహిళ అయినంత మాత్రానా బెయిల్ ఇవ్వాలా,భర్తను గొంతు కోసి చంపేసిన కేసులో భార్యకు షాకిచ్చిన కోర్టు

డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం క్లెయిమ్‌ను అనుమతించింది. ఆ మొత్తం ప్రయాణికుడికి రీయింబర్స్ చేయాలని రైల్వేని ఆదేశించింది. దీనిపై రైల్వే సుప్రీంకోర్టుకు వెళ్లింది.  పిటిషన్ విచారంచిన ధర్మాసనం రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (“NCDRC”) అప్పీళ్లను తోసిపుచ్చింది. ప్రయాణీకుల వ్యక్తిగత వస్తువులను దొంగిలించడం రైల్వే యొక్క “సేవల లోపం” పరిధిలోకి రాదని బెంచ్ అభిప్రాయపడింది.

దీని ప్రకారం జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, జిల్లా వినియోగదారుల ఫోరం జారీ చేసిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కనపెట్టింది.  ప్రయాణీకుల వస్తువుల దొంగతనానికి రైల్వే బాధ్యత వహించదని తెలిపింది.