Tamil Nadu CM MK Stalin (Photo-ANI)

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషుల విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఆరుగురు వ్యక్తుల విడుదలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను నియమిత స్థానాల్లో ఉన్న గవర్నర్లు రద్దు చేయకూడదనడానికి ఈ తీర్పు నిదర్శనమని సీఎం తెలిపారు.