Bengaluru Cafe Blast (PIC@ PTI X)

Bengaluru, Mar 13: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ బాస్ట్‌ కేసులో ప్రధాన నిందితుడిని కలిసి వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకున్నది. పేలుడు ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ.. బళ్లారి పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడితో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన సయ్యద్ షబ్బీర్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ అరెస్టుపై ఎన్‌ఐఏ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఇతను సహకరించినట్లు సమాచారం. ఈ నెల ఒకటో తేదీన బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న రామేశ్వరం కెఫేలో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి చిత్రాలను విడుదల చేశారు. అతని ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ఎన్‌ఐఏ ప్రకటించింది. బెంగుళూరు రామేశ్వ‌రం కేఫ్ పేలుడు వీడియో ఇదిగో, ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడంతో బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

ఎన్‌ఐఏ రంగంలోకి దిగి.. అనుమానితుడిని పట్టుకునేందుకు రూ.10లక్షల రివార్డు సైతం ప్రకటించింది. ఆచూకీ తెలిస్తే info.blr.nia@gov.in మెయిల్‌ ఐడీతో పాటు 080-29510900, 8904241100 నంబర్లలో సంప్రదించాలని కోరింది.ఈ కేసులో నిందితుడు ఆర్‌డీఎక్స్‌ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి అరెస్టు చేశారు.

Here's News

రామేశ్వరం కేఫ్‌ ఐఈడీ బ్లాస్ట్‌ కేసులో అనుమానితుడిని కలిసి షబ్బీర్‌ను అరెస్టు చేసినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. షబ్బీర్‌ను సైతం ప్రధాన నిందితుడిగానే చూస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. బళ్లారిలో మార్చి 1న ప్రధాన నిందితుడిని కలిశాడు. షబ్బీర్ బళ్లారిలో నిందితుడితో మాట్లాడినట్లు తెలుస్తున్నది. పేలుడు జరిగిన దాదాపు ఎనిమిది గంటల తర్వాత మార్చి 1న బళ్లారి బస్టాండ్‌లో అనుమానితుడు చివరిసారిగా కనిపించాడు. బెంగుళూరు రామేశ్వ‌రం కేఫ్‌లో పేలింది బాంబులే సిలిండర్ కాదు, స్ప‌ష్టం చేసిన కర్ణాటక సీఎం సిద్ధ‌రామ‌య్య‌, బ్యాగులో ఉన్న ఐఈడీ కార‌ణంగానే పేలుళ్లు జరిగాయని నిర్థారణ

పేలుడు ఘటనలో ఎన్‌ఐఏ ఇస్లామిక్‌ స్టేట్‌ (ISIS) మాడ్యూల్స్‌ నుంచి నలుగురిని అదుపులోకి తీసుకుంది. నిందితుడు కేఫ్‌ నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత తన వేషధారణను మార్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అతడు ధరించిన బేస్‌ బాల్‌ క్యాప్‌, షర్ట్‌ను మార్చుకొని.. సాధారణ టీ షర్ట్‌ ధరించినట్లు గుర్తించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. పేలుడుతో మూతపడిన రామేశ్వరం కేఫ్‌ 9న మళ్లీ తెరుచుకున్నది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని కేఫ్‌ సహ వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు తెలిపారు.