Yavatmal, March 04: మహారాష్ట్రలో (Maharastra) భూమి ఒక్కసారిగా చీలిపోయింది. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పగిలి భూమి బద్దలైంది. రోడ్డు రెండుగా చీలిపోయింది. పాతాళంలోచి గంగమ్మ ఎగసిపడిందా? నడిరోడ్డుపై సునీమీ విరుచుకుపడిందా? అనేలా నీరు భారీగా ఎగసిపడింది. దీంతో ప్రజలు హడలిపోయారు. రోడ్డు ఒక్కసారిగా చీలిపోయింది. భూమి రెండుగా బద్దలై పాతాళంలోంచి నీరు ఎగసిపడినట్లుగా రెండుగా చీలిపోయిన రోడ్డులోంచి (underground pipeline burst) నీరు ఫౌంటెన్ లా ఎగసిపడింది. ఈ దృశ్యాల్ని అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#WATCH | Road cracks open after an Artificial Neural Network (ANN) underground pipeline burst in Yavatmal, Maharashtra earlier today. The incident was captured on CCTV. A woman riding on scooty was injured pic.twitter.com/uRQ9x2pEFj
— ANI (@ANI) March 4, 2023
కొన్ని క్షణాలు వరకు ఆ రోడ్డు ప్రశాంతంగా కనిపించింది. ఎవరికివారు వాహనాలతో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఒక్కసారిగా రోడ్డు రెండుముక్కలైంది. అంతేకాదు ఉప్పెనలా నీరు బయటకు ఎగిసిపడింది. ఏం జరిగిందో..జరుగుతుందో తెలియిక ప్రజలు భయంతో పరుగులు తీశారు.అదే సమయంలో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.మరికొందరు మాత్రం తృటిలో తప్పించుకున్నారు.
మహారాష్ట్రంలోని యావత్ మాల్ (Yavatmal) ప్రాంతంలో పైప్ లైన్ బద్దలైందని అధికారులు తేల్చారు.. నీటి ఉదృతికి రోడ్డు ఒక్కసారిగా రెండుగా చీలిపోయి నీరు భారీగా ఎగసిపడింది. ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఊహించని ఈ ఘటనతో ఆరోడ్డుపై స్కూటీపై వెళుతున్న ఓ మహిళ గాయపడినట్లుగా తెలుస్తోంది. నీటి ఉదృతి భూమి చీలిపోయి భారీగా నీరు వచ్చింది. సెకెన్లలో ఆ రోడ్డంతా జలమయమైంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది..