New Delhi, March 08: మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్న భర్తను (Sex With Minor Wife) నిర్ధోషిగా తేల్చింది సుప్రీంకోర్టు. భార్య అంగీకారంతో తెలిసి శృంగారంలో పాల్గొన్నప్పటికీ...ఆమె మైనర్ అయితే మాత్రం నేరంగానే పరిగణించాల్సి వస్తుందని స్పష్టం గతంలో కోర్టులు తీర్పులు ఇచ్చాయి. కానీ అందుకు భిన్నంగా సుప్రీంకోర్టులో తీర్పు వెలువడింది. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.గతంలో ఐపీసీ 375 ప్రకారం మైనర్ భార్యతో లైంగిక చర్యల్లో పాల్గొన్న (Sex With Minor Wife) భర్తకు దాన్ని నుంచి మినహాయింపు ఉండేది. తాజా నిబంధనతో దీన్ని అత్యాచారంగా పరిగణిస్తారు.భారత శిక్షా స్మృతి 375లోని సెక్షన్ 2 ప్రకారం భర్తకు రక్షణ కల్పించడం మైనర్ బాలికకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని కోర్టు అభిప్రాయపడింది.
Sex With Minor Wife : #SupremeCourt Acquits Husband Of Rape Relying On Exception 2 To Sec 375 IPC | @awstika https://t.co/sDbPD1hf9P
— Live Law (@LiveLawIndia) March 8, 2023
అయితే కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి తన మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్న కేసులో సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. జస్టిస్ B.R గవాయ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఈ కేసులో భార్య, భర్త పరస్పర అంగీకారంతోనే వివాహం జరిగిందని నిందితుడి తరుపున ప్రాసిక్యూటర్ తెలిపారు. అయితే పరస్పర అంగీకారంతో జరిగిన ఈ చర్యను కర్నాటక కోర్టు నేరంగానే పరిగణించింది. కానీ జస్టిస్ B.R. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మాత్రం భిన్నంగా తీర్పు ఇచ్చింది. బాల్యవివాహాలను (Child marriages) అరికట్టడంలో భాగంగా గతంలో ఇలాంటి కేసుల్లో భర్తలను దోషులుగా ప్రకటించాయి న్యాయస్థానాలు. కానీ ఈ సారి మాత్రం భిన్నంగా తీర్పు వెలువడింది.