Tripura, Nagaland, Meghalaya Election Results

New Delhi, March 02 : ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.  త్రిపుర (Tripura), మేఘాలయ(Meghalaya), నాగాలాండ్(Nagaland)ల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Election Results) నిర్వహిస్తున్నారు. మేఘాలయలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరి నడుస్తోంది. ఇక్కడ టీఎంసీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు నామమాత్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు నాగాలాండ్ లో నేషనలిస్ట్ డెమెక్రటిక్ ప్రొగ్రెసివ్ కూటమి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు త్రిపురలో ఏన్డీయే, లెఫ్ట్ కూటమి మధ్య హోరా హోరి ఉంది.

నాగాలాండ్, మేఘాలయల్లో ఇప్పటికే ఒక్కో అసెంబ్లీ స్థానం ఏకగ్రీవం కాగా 59 అసెంబ్లీ స్థానాల చొప్పున పోలింగ్ జరిగింది. త్రిపురలో 88శాతం పోలింగ్ నమోదు కాగా.. మేఘాలయలో 76శాతం, నాగాలాండ్ రాష్ట్రంలో 84శాతం ఓట్లు పోలయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మరింత విస్తరించాలన్న అధికార బీజేపీ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయనేది నేటి ఫలితాల్లో తేలనుంది. త్రిపుర రాష్ట్రంలో ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. ఈ రాష్ట్రంలో పాతికేళ్ల వామపక్ష పాలనకు తెరదించుతూ అభివృద్ధి నినాదంతో బీజేపీ 2018లో సొంతంగా అధికారంలోకి వచ్చింది. ఈసారి బీజేపీని గద్దెదించేందుకు లెఫ్ట్, కాంగ్రెస్ జట్టుకట్టి ఎన్నికల బరిలో నిలిచాయి.