Srinagar, April 08: కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుకు (Kiren Rijiju) తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి హాని జరగలేదు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన కారును శనివారం రాంబన్ జిల్లాలో శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారిపై (Jammu to Srinagar) వెళ్తుండగా ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఆయనే కాకుండా కారులో ఉన్నవారంతా క్షేమంగానే ఉన్నట్లు తెలిసింది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
VIDEO | Union Minister of Law and Justice @KirenRijiju's car met with a minor accident while going from Jammu to Srinagar earlier today. No one was injured in the accident. pic.twitter.com/bix6GaM7bX
— Press Trust of India (@PTI_News) April 8, 2023
దీనికి ముందు కిరణ్ రిజిజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు ఉద్దాంపూర్ వెళ్తున్నట్లు ట్వీట్ చేశారు. దారిలో కారులో రోడ్డు ప్రయాణాన్ని వీడియో తీసి, దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘జమ్మూ కశ్మీర్ లోని ఉద్దాంపూర్లో నిర్వహించే న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాను. ప్రయాణం అంతా అందమైన రహదారిని ఆనందించవచ్చు’’ అని రాసుకొచ్చారు.