Representational image (Photo Credit: File Photo)

Lucknow, August 23: యూపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గర్భిణికి మాయమాటలు చెప్పిన నలుగురు కామాంధులు ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోని ఇంటికి తీసుకువెళ్లి ( Pregnant woman abducted) మూడు రోజుల పాటు సామూహిక అత్యాచారం (gang-raped by four men for three days) చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలి జిల్లాకు చెందిన మహిళ గత మంగళవారం సహారాన్ పూర్ కు వెళ్లడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఆమెను ఫరూకాబాద్ లోని బస్ టెర్మినల్ వద్ద కొందరు మాటలు కలిపారు. ఆ తర్వాత ఆమెను మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లారు.

అక్కడ మూడు వారాలపాటు ఆమెను బలవంతంగా అత్యాచారం చేశారు. ఈ క్రమంలో నిందితులు పడుకొని ఉండగా మహిళా మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. అక్కడ ఉన్న గ్రామస్తులకు తన బాధను చెప్పుకోగా వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు రోజులుగా కనీసం ఎలాంటి ఆహారం ఇవ్వలేదని ఆ మహిళా కన్నీరు పెట్టుకుంది. అంతేకాకుండా చంపుతామని పలుమార్లు బెదిరించారని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కట్టుకున్న భర్తే దారుణంగా, అందరిముందే నగ్నంగా స్నానం చేయించిన మూర్ఖపు భర్త, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, ఫేక్ బాబాపై కేసు నమోదు చేసిన పోలీసులు

నలుగురు పురుషులు నిద్రిస్తున్న సమయంలో మహిళా తప్పించుకుపోయిందని రాజేపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హేచ్ఓ దినేష్ గౌతమ్ తెలిపారు. బహదూర్ పూర్ గ్రామానికి చేరుకోవడానికి ముందు తాను 12 కిలోమీటర్లు నడిచానని, అక్కడ సహాయం కోసం కొంతమంది గ్రామస్తులను సంప్రదించానని ఆమె చెప్పింది. దీంతో గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు మహిళను ఇంటికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్ హెచ్ ఓ తెలిపారు.