Income Tax (Photo-IANS)

Farmer Gets 23 Notices to Pay Rs 1.6 Crore Tax: యూపీలో ముజఫర్‌నగర్‌ జిల్లాలోని ఫలోడా గ్రామానికి చెందిన ఒక రైతుకు (UP farmer) రూ.1.6 కోట్ల పన్ను చెల్లించాలంటూ సంవత్సరంలో ఏకంగా 23 నోటీసులు అందాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాలో రూ.4 కోట్ల 6 లక్షల మేర లావాదేవీలు జరిపారని ఈ లావా దేవీలకు సంబంధించి రూ.1.6 కోట్ల పన్నులను ఉపదేశ్‌ త్యాగి అనే చిన్నకారు రైతు చెల్లించాల్సి ఉందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

రైతు ఉపదేశ్‌ త్యాగితోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఐటీ నోటీసులు చూసి షాక్‌ అయ్యారు.న బ్యాంకు ఖాతా నుంచి కోట్లలో లావాదేవీలు జరుపలేదని ఐటీ అధికారులకు అతడు చెప్పినా వారు పట్టించుకోలేదు. పన్ను చెల్లించాల్సిందేనని లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మూడు వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ఆ రైతు ఇంటిపై రైడ్‌ కూడా చేశారు.

సోషల్ మీడియా స్టేటస్‌గా టిప్పు సుల్తాన్ బొమ్మ, రాళ్లదాడితో రణరంగంగా మారిన కొల్హాపూర్‌, గుంపులతో ఉండకూడదని నిషేధ ఉత్తర్వులు అమల్లోకి..

చివరకు బ్యాంకులో పొరపాటు జరిగినట్లు ఐటీ శాఖ అధికారులు చివరకు గుర్తించారు. అభిషేక్ అనే వ్యక్తి పాన్‌ కార్డు వివరాలను పొరపాటుగా రైతు త్యాగి బ్యాంకు ఖాతాలో నమోదు చేసినట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పొరపాటును సరిదిద్దేందుకు సంబంధిత చర్యలు తీసుకున్నట్లు ఐటీ అధికారి రజనీష్‌ వెల్లడించారు.