Representational Image (Photo Credit: ANI/File)

HC allows married woman to stay with live-in partner: ఓ కేసులో భార్య తనకు నచ్చిన వారితో కలిసి ఉండవచ్చని ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తన భార్య మిస్ అయిందని డెహ్రాడున్ కు చెందిన జిమ్ ట్రైనర్ అయిన ఓ భర్త ఉత్తరాఖండ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆమె తన భర్తను, పదేళ్ల కొడుకును, ఆరేళ్ల కూతురును డెహ్రాడున్ లోనే వదిలేసి, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఫరీదాబాద్ కు చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

తన లెస్బియన్ భాగస్వామిని ఆమె తల్లిదండ్రుల నుంచి విడిపించాలని యువతి హెబియస్ కార్పస్ పిటిషన్‌, కొట్టేసిన కేరళ హైకోర్టు

కోర్టుకు హాజరైన ఆమె తన భర్త తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, తాను అతనితో కలిసి ఉండేది లేదని కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో జస్టిస్ పంకజ్ పురోహిత్, జస్టిస్ మనోజ్ తివారీలతో కూడిన ధర్మాసనం ఆమెకు నచ్చినట్లుగా ఉండవచ్చునని తీర్పు ఇచ్చింది. భర్త తరఫున పిటిషన్ దాఖలు చేసిన అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇలాంటి తీర్పు వివాహ వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఆమెకు నచ్చినట్లుగా ఉండవచ్చునని కోర్టు తెలిపింది.

ప్రతి మహిళ ప్రసూతి సెలవుకు అర్హురాలే, వారు గర్బవతి అయితే కంపెనీ సెలవులు ఇవ్వాల్సిందే, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

పిటిషన్ వేసిన భర్తకు మహిళతో 2012 ఫిబ్రవరిలో పెళ్లయింది. ఆమెకు ఫరీదాబాద్ కు చెందిన ఓ వ్యక్తితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. 2022 ఆగస్ట్ 7న 37 ఏళ్ల వయస్సులో ఆమె అతని వద్దకు వెళ్లిపోయి, సహజీవనం చేస్తోంది. తాను తన ఇష్టపూర్వకంగా ఫరీదాబాద్ వ్యక్తితో సహజీవనం చేస్తున్నానని సదరు మహిళ చెప్పడంతో కోర్టు పైవిధంగా తీర్పు ఇచ్చింది.