Minor girl jumps out of moving autorickshaw (Photo-Video Grab)

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. డ్రైవర్‌ లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఓ మైనర్ బాలిక అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మైనర్‌ ఆటోలో నుంచి కిందకు దూకింది.

షాకింగ్ వీడియో, సూట్‌కేస్‌లో గుర్తు తెలియన మృతదేహం, జలంధర్ రైల్వే స్టేషన్ వెలుపల రెడ్ కలర్ సూట్‌కేస్‌ను కనుగొన్న పోలీసులు

ఈ ప్రమాదంలో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాలిక ఆటో నుంచి పడిపోవడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన స్పందించి ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ రోడ్డు పక్కనున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

Here's CCTV Video

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు డ్రైవర్ సయ్యద్ అక్బర్ హమీద్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.