ED Notice to Xiaomi India: రూ. 500 కోట్లు ఎగ్గొట్టారంటూ షియోమీకి ఈడీ నోటీసులు, ఫెమా చట్టం కింద భారీగా ఆస్తుల సీజ్‌
Xiaomi (Photo-IANS)

Mumbai, June 09: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘షియోమీ ఇండియా` అధికారులకు, మూడు బ్యాంకుల అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. రూ.5551 కోట్ల నిధుల్లో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై షియోమీ ఇండియా సీఎఫ్ఓ సమీర్ రావు, మాజీ ఎండీ మను జైన్, మూడు విదేశీ బ్యాంకులకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఈడీ అధికారులు శుక్రవారం ట్వీట్‌లో ధ్రువీకరించారు. షియోమీ ఇండియా `ఫెమా` నిబంధనలకు విరుద్ధంగా రూ.5551.27 కోట్ల అక్రమ చెల్లింపులు జరిపిందని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈడీ నోటీసులు అందుకున్న వారిలో షియోమీ సీఎఫ్ఓ సమీర్ రావు, మాజీ ఎండీ మను జైన్‌లతోపాటు సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, డచెస్ బ్యాంక్ ఏజీ ఉన్నాయి.

విదేశాల్లోని సంస్థకు రాయాల్టీ పేరిట రూ.5551.27 కోట్ల నిధులు అక్రమంగా చెల్లించాలని ఈడీ పేర్కొంది. ఈ నిధులను ఈడీ జప్తు చేసింది. ఫెమా చట్టంలోని 37ఏ సెక్షన్ కింద షియోమీకి చెందిన రూ.5551.27 కోట్ల నిధులు జప్తు చేశామని పేర్కొంది.

HC on Pay and Benefits to Wife: భార్య నిర్లక్ష్యంపై కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు, ఆమె కూతురును భర్తకు అప్పగించేవరకు అన్ని ప్రయోజనాలు నిలిపివేయాలని తీర్పు 

తమ దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఫెమా నిబంధనలకు అనుగుణంగా సంబంధిత వ్యక్తులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, విధించిన పెనాల్టీని షియోమీ ఇండియా చెల్లించాల్సిందేనని ఈడీ అధికారులు స్పష్టం చేశారు.