Politics

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో పొలిటికల్‌ హైడ్రామాలో ట్విస్ట్, ఏక్‌నాథ్‌ షిండేకు షాకిచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌

Hazarath Reddy

మహారాష్ట్రలో పొలిటికల్‌ హైడ్రామా కొనసాగుతోంది. తాజాగా రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండేతో కలిసి సూరత్‌ వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌ అక్కడి నుంచి తిరిగి మహారాష్ణ చేరుకున్నారు. ఈ సందర్భంగా రెబల్‌ ఎమ్మెల్యేలపై నితిన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను కిడ్నాప్ చేసి సూరత్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు

Atmakur Bypoll 2022: రేపే ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్, ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌, బరిలో 14 మంది అభ్యర్థులు, అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపిన ఈసీ

Hazarath Reddy

ఈ నెల 23న జరగనున్న ఆ‍త్మకూరు ఉప ఎన్నిక పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్‌ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్‌ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు.

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్, అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని తెలిపిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

Hazarath Reddy

మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం ఉద్ధవ్‌ థాక్రే అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరుగనుంది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేశారు. ఇక సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు.. ఆదిత్య ఠాక్రే తన ట్వి‍ట్టర్‌ ఖాతాలో మంత్రి హోదాను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

CM Uddhav Thackeray Covid: సీఎం ఉద్ధవ్‌ థాకరేకి కరోనా, ఐసోలేషన్‌లోకి వెళ్లిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి

Hazarath Reddy

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరేకి కరోనా బారినపడ్డారు. బుధవారం ఆయన కరోనా టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. సీఎంకు కరోనా సోకడంతో వర్చువల్‌గా కేబినెట్‌ భేటీలో పాల్గొననున్నట్టు తెలిపారు.

Advertisement

Maharashtra Political Crisis: ఉద్ధవ్ థాకరే సర్కారును కూల్చాలంటే బలమెంత ఉండాలి, ఇంతకీ ఏకనాథ్ షిండే ఎవరు, ఎంతమంది ఎమ్మెల్యేలను ప్రభావితం చేయగలడు, మహా రాజకీయాలపై స్పెషల్ స్టోరీ

Hazarath Reddy

మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే ఏకనాథ్ షిండే తిరుగుబాటుతో రాజకీయం వేడేక్కింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో మొదలైన రగడ సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింత ముదిరి రాజకీయ సంక్షోభానికి (Maharashtra Political Crisis) దారితీసింది.

Maharashtra Political Crisis: ఏక్‌నాథ్‌ షిండేపై వేటు, శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించిన ఉద్ధవ్ సర్కారు, షిండే స్థానంలో ఎమ్మెల్యే అజయ్‌ చౌదరి నియామకం

Hazarath Reddy

మహారాష్ట్ర కేబినెట్ మంత్రి మంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై శివసేన చర్యలు చేపట్టింది. శాసనసభాపక్ష నేత పదవి నుంచి ఏక్‌నాథ్‌ షిండేను తొలగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. షిండే స్థానంలో ఎమ్మెల్యే అజయ్‌ చౌదరి నియమించింది.

Presidential Election 2022: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా, అధికారికంగా ప్రకటించిన జైరాం రమేష్‌

Hazarath Reddy

రాష్ట్రపతి ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాను ఖరారు చేశారు. ఈ మేరకు జైరాం రమేష్‌ అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్‌ఎక్స్‌ భవన్‌లో సమావేశమైన 18 విపక్ష పార్టీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.

Maharashtra Political Crisis: ఇది మహారాష్ట్ర... రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ కాదని తెలిపిన సంజయ్ రౌత్, ఈ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన బీజేపీ నేత ప్రవీణ్‌ దరేకర్‌

Hazarath Reddy

మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారనే వార్తల నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో శివ సేన నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు.

Advertisement

Maharashtra Politics: సంక్షోభంలో ఉద్ధవ్ థాకరే సర్కారు, 21 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్, మహా సంక్షోభానికి తెర లేపబోతున్న శివసేన పార్టీ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఊహించని పరిణామాలు (Maharashtra Political Crisis) జరుగుతున్నాయి. అధికార కూటమిలోని శివసేన పార్టీ ఎమ్మెల్యే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde ) వేరు కుంపటితో.. మహా వికాస్‌ అఘాడి కూటమిని సంక్షోభం వైపు తీసుకెళ్తున్నారు.

Rajender Meets Amit Shah: ఈటెల రాజేందర్‌కు కీలక పదవి.., హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే

Hazarath Reddy

మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి ఢిల్లీలో షాను కలిసిన ఈటల.. రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన గురించి చర్చించానని తెలిపారు.

Dhulipalla Narendra Arrested: ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్, చలో అనుమర్లపూడికి అనుమతి లేదని తెలిపిన పోలీసులు, గ్రామంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని స్పష్టం

Hazarath Reddy

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద నరేంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, గ్రామంలో మట్టి తవ్వకాలపై చలో అనుమర్లపూడికి ధూళిపాళ్ల పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చలో అనుమర్లపూడికి అనుమతి లేదంటూ పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని స్పష్టం చేశారు.

Tripura By-Polls: కాంగ్రెస్ నేతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న త్రిపుర కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌ రాయ్‌ బర్మాన్‌

Hazarath Reddy

ఉప ఎన్నికల వేళ త్రిపురలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌ రాయ్‌ బర్మాన్‌పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు.

Advertisement

Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసే ప్రయత్నాల్లో బీజేపీ, అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధి కోసం విపక్షాలతో రాజ్‌నాథ్ సింగ్ మంతనాలు, మమతా బెనర్జీ సహా పలువురికి ఫోన్లు, ఇక విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిపై ఇంకా రాని స్పష్టత

Naresh. VNS

బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలకు రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు. మధ్యాహ్నం కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేతో (Kharge) ఫోన్ లో మాట్లాడిన రాజ్ నాథ్, సాయంత్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha Benarjee), అఖిలేష్ యాదవ్ (Akhiesh Yadav)లతో ఫోన్ లో విడివిడిగా మాట్లాడారు.

Questioning Rahul Gandhi: మూడో రోజు ముగిసిన రాహుల్ గాంధీ విచారణ, శుక్రవారం మళ్లీ రావాలంటూ రాహుల్‌కు ఈడీ ఆదేశాలు, ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ లేదంటూ బల్లగుద్ది వాదించిన రాహుల్

Naresh. VNS

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)విచారణ మూడో రోజు ముగిసింది. బుధవారం దాదాపు తొమ్మిది గంటల పాటు రాహుల్ గాంధీని అధికారులు విచారించారు. అయితే విచారణ (Questioning) పూర్తికాలేదని, మళ్లీ శుక్రవారం విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఈడీ (ED) అధికారులు స్పష్టం చేశారు.

President Election 2022: రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, జులై 18న ఎన్నికలు, జులై 21న కౌంటింగ్, జులై 24తో ముగియనున్న ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం

Hazarath Reddy

రాష్ట్రపతి ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఎన్నికల ద్వారా భారతదేశ 16వ రాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నారు. ఈ నెల 29 వరకు రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చు

National Herald Case: నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు పూర్వాపరాలు ఏంటీ? మూడు గంటల పాటు రాహుల్ గాంధీని విచారించిన ఈడీ, స‌త్యాగ్ర‌హ ప్ర‌ద‌ర్శ‌న చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు, పలువురు అరెస్ట్

Hazarath Reddy

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో (National Herald Case) ఈడీ ఎదుట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమ‌వారం విచార‌ణ‌కు హాజరయ్యారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మూడు గంటలపాటు ప్రశ్నించింది.

Advertisement

Telangana: భారతీయ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందేకు పీకేతో కలిసి వ్యూహం

Hazarath Reddy

దేశంలో నెలకొన్న రాజకీయ శూన్యతను పూరించేందుకు జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించాల్సిందేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(CM K Chandrashekar Rao) కృత నిశ్చయంతో ఉన్నారని.. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలతో సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారని తెలిసింది.

Andhra Pradesh: లోకేష్‌ పుట్టుకతో వచ్చిన సమస్యతో ఇలా తయారయ్యాడు, మండిపడిన విజయసాయి రెడ్డి, లోకేష్ చర్చకు సిద్ధం అన్నది జగన్‌తో అంటూ అయ్యన్న కౌంటర్

Hazarath Reddy

టీడీపీ కుసంస్కారంతో వ్యవహరిస్తోంది. మావాళ్లని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. లోకేష్‌కు పుట్టుకతో వచ్చిన సమస్య వలన ఇలా తయారయింది. నిన్న లోకేష్ జూమ్ మీటింగ్ కి కంసమామ జగన్ అంటూ పేరు పెట్టారు. అంటే ఎంత జుగుప్సాకరమైన వ్యవహారాలు చేస్తున్నారో చూడండి. అందుకే ప్రశ్నించటానికి మా వాళ్లు వెళ్లారు.

Atmakur Bypoll 2022: వైసీపీ మెజార్టీ ఎంతనేదే చర్చ, ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు, బీజేపీ-వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు (Atmakur Bypoll 2022) సంబంధించిన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసిందని రిటర్నింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరీందర ప్రసాద్‌ తెలిపారు.

Presidential Election 2022: కొత్త రాష్ట్రపతి ఎవరో జూలై 21న తేలిపోనుంది, ప్రెసిడెన్షియల్ ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎలక్షన్ కమిషన్

Hazarath Reddy

ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుండటంతో కొత్త ప్రెసిడెంట్ కోసం ఎన్నికలకు (Presidential Election 2022) సిద్ధమైంది ఎన్నికల కమిషన్. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు జూన్ 15న పిలుపునివ్వనుండగా.. నామినేషన్స్ వేసేందుకు ఆఖరి తేదీ జూన్ 29 నిర్ణయించారు.

Advertisement
Advertisement