రాజకీయాలు

Assam-Mizoram Border Dispute: అస్సాం-మిజోరం స‌రిహ‌ద్దు వివాదం ఏమిటి? సమస్య ఎప్పటి నుంచి రగులుతోంది, 5 గురు అస్సాం పోలీసులు మృతితో మళ్లీ అక్కడ సమస్య తీవ్రరూపం, అస్సాం-మిజోరం స‌రిహ‌ద్దు వివాదంపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం స‌రిహ‌ద్దు ఇప్పుడు దాడులతో (Assam-Mizoram Border Dispute) అట్టుడుకుతోంది. సోమ‌వారం జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు మ‌ర‌ణించారు. ఈ ఘటన అక్కడ మ‌రింతగా ఉద్రిక్త‌త‌ల‌ను పెంచింది. ఈ సమస్య ఎప్పటి నుంచో అక్కడ రగులుతూ ఉన్నప్పటికీ పాలకులు దీనికి సరైన పరిష్కారం చూపలేకపోవడంతో అది రావణకాష్టంలా రగులుతూనే ఉంది.

Telangana Dalit Bandhu Scheme: హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదు, దశల వారీగా దళితబంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం, Dalit Bandhu అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్

Hazarath Reddy

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన దళితబంధు (Telangana Dalit Bandhu ) అవగాహన సదస్సు ప్రగతి భవన్ లో జరిగింది. దళితబంధు’పథకం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి 412 మంది దళిత ప్రతినిధులు, 15 మంది రిసోర్స్‌పర్సన్‌లు కలిపి మొత్తం 427 మంది 16 ప్రత్యేక ఏసీ బస్సుల్లో వచ్చారు.

Karnataka politics: తరువాత ముఖ్యమంత్రి ఎవరని నేను చెప్పను, నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు, మరొకరికి అవకాశం కల్పించేందుకు రాజీనామా చేశా, వ‌చ్చే సీఎంకు 100 శాతం స‌హ‌కారం అందిస్తానని బీఎస్ యడియూరప్ప వెల్లడి

Hazarath Reddy

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటంలో తనపై ఎవరి ఒత్తిడి లేదని (Nobody pressurised me to resign), మరొకరికి అవకాశం కల్పించేందుకు రాజీనామా చేశానని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్పష్టం చేశారు. రాజీనామా నిర్ణయం తన సొంత నిర్ణయమని (I did it on my own) బీఎస్ యడియూరప్ప తెలిపారు.

Karnataka Politics: బీఎస్ యడ్యూర‌ప్ప రాజీనామాకు గవర్నర్ ఆమోదం, త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం చేసేవ‌ర‌కు కేర్ టేక‌ర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించాల‌ని సూచన

Hazarath Reddy

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ యడ్యూర‌ప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తావ‌ర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. అయితే, త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం చేసేవ‌ర‌కు రాష్ట్రానికి కేర్ టేక‌ర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించాల‌ని ఆయన సూచించారు.

Advertisement

Who is Next Karnataka CM?: కర్ణాటక సీఎం రేసులో ఉన్నది వీరే, పంచ‌మ‌శాలి లింగాయ‌త్‌ వర్గం, గౌడ వర్గం నుంచే ప్రధానంగా పోటీ, బి.ఎస్.యడ్యూరప్ప రాజీనామాతో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న జాబితాపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు బీఎస్ య‌డ్యూర‌ప్ప ప్ర‌క‌టించ‌డంతో తదుపరి ముఖ్యమంత్రి (Who is Next Karnataka CM) ప‌ద‌వి కోసం ప‌లువురి పేర్లు (several leaders in race for Karnataka CM's post) వినిపిస్తున్నాయి

BS Yediyurappa Resigns as Karnataka CM: తరువాత ఎవరు..ముఖ్యమంత్రి పదవికి బి.ఎస్.యడ్యూరప్ప రాజీనామా, గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్న సీఎం, 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేస్తానని వెల్లడి

Hazarath Reddy

కొద్ది రోజులుగా సస్పెన్స్ రేపుతూ వస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఎట్టకేలకు తెరపడింది. బి.ఎస్.యడ్యూరప్ప (BS Yediyurappa To Resign As Karnataka CM) ముఖ్యమంత్రి పదవికి రాజీనామా (BS Yediyurappa announces his resignation) చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు.

Eluru Municipal Election Results: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ దూకుడు, ఇప్పటికే 17 స్థానాలను కైవసం చేసుకున్న అధికార పార్టీ, ఒక్కస్థానంలో టీడీపీ గెలుపు, ఇంకా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో (Eluru Municipal Election Results) అధికార వైసీపీ తన సత్తా చాటుకుంది. ఇప్పటివరకు వైసీపీ 17 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ మాత్రం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైంది. మరిన్ని డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంది.

Dalit Bandhu Scheme: దళితబంధు పథకం కింద ఇచ్చే మొత్తం పూర్తిగా ఉచితం, ఇందుకోసం రూ. లక్ష కోట్లయినా ఖర్చుపెడతాం, ఈటెల చిన్నోడు..ఏం చేయలేడు, హుజూరాబాద్ నేతలతో సీఎం కేసీఆర్, తనుగుల ఎంపీటీసీ భర్త రామస్వామికి స్వయంగా ఫోన్‌ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ (TRS) అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నదళిత బంధు పథకాన్ని (Dalit Bandhu Scheme) హుజూరాబాద్ నియోజకవర్గంలో మరింత బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Advertisement

Eluru Corporation Election Results: ఏలూరు కార్పోరేషన్ ఎవరి ఖాతాలోకి, ఇప్పటికే 3 వైసీపీ కైవసం, మిగతా 47 స్థానాల్లో కొనసాగుతున్న కౌంటింగ్, మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితాలు

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల (Eluru Municipal Corporation Election Results) కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఏలూరు శివారులోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఇప్పటికే పటిష్ట ఏర్పాట్లు చేశారు. 47 డివిజన్లకు 48 టేబుల్స్‌పై ఒకే రౌండ్‌లో ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Motkupalli Narsimhulu: బీజేపికి రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సింహులు, పార్టీలో సరైన గుర్తింపు లేదని ఆవేదన, సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు, త్వరలో టీఆర్ఎస్‌లో చేరే అవకాశం?

Vikas Manda

మోత్కుపల్లి నర్సింహులు మాటలను బట్టి ఆయన త్వరలోనే తెరాసలో చేరే అవకాశం ఉన్నట్లు అర్థం అవుతోంది. ఈటల రాజేంధర్ టీఆర్ఎస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆయన సీఎం కేసీఆర్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు..

Kaushik Reddy Joins TRS: టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డి, తెలంగాణ పునర్మిర్మాణం ట్రాక్ ఎక్కిందన్న సీఎం కేసీఆర్, దళితబంధు ఎన్నికల కోసం కాదని స్పష్టత, ఎవరి విమర్శలకు బెదరబోమని వ్యాఖ్యలు

Team Latestly

కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పేదరికం ఉంది. పేదరికం, సామాజిక వివక్ష ఇంకా దళితవాడల్లో ఉంది. దళితబంధు అంటే పుట్నాలు, పేలాలు పంచినట్టు కాదు. దళితులకు రూ.10 లక్షల స్కీం వెనుక మంచి ఉద్దేశం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల కోసం కాదన్నారు...

Parliament Monsoon Session 2021: ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ప్రత్యేక హోదా, పోలవరంపై ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు ఆందోళన, రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని డిమాండ్‌

Hazarath Reddy

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం (Parliament Monsoon Session 2021) కాగా విపక్షాల ఆందోళనల నేపథ్యంలో​ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. పెగాసస్‌ వ్యవహారంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంపై ఉభయ సభల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు.

Advertisement

YSRCP MPs Protest in Parliament: ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాల్సిందే, రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లిన విజయసాయిరెడ్డి, రూల్‌ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు ఇచ్చిన వైసీపీ ఎంపీ, పోలవరంపై చర్చ చేపట్టాలని లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన

Hazarath Reddy

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన (YSRCP MPs Protest in Parliament) కు దిగారు. పోలవరంపై చర్చకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు (YSRCP MPs) పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు. వాయిదా తీర్మానానికి ఎంపీ మిథున్ రెడ్డి నోటీసు ఇచ్చారు.

Monsoon Session of Parliament: వ్యాక్సిన్ తీసుకుని అందరూ బాహుబలులయ్యారు, విపక్షాల ఆందోళన మధ్య ప్రసంగాన్ని కొనసాగించిన ప్రధాని మోదీ, ఉభయసభలు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వర‌కు వాయిదా

Hazarath Reddy

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్‌ సమావేశాలకు (Monsoon Session of Parliament) ముందు ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను సభ్యులందరూ అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ సమావేశాలు పత్యక్షంగా జరపటం సంతోషకరమన్నారు. లోక్‌సభలో విపక్షాల ఆందోళన మధ్యే ప్రధాని మోదీ ( PM Narendra Modi) తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Kokapet Lands Row: కోకాపేట భూముల వేలంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్, కోకాపేట భూముల సందర్శన, ధర్నాకు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్

Hazarath Reddy

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోకాపేట భూముల సందర్శనకు (Kokapet lands) ఈరోజు వెళతానని ఆయన ప్రకటించారు. కోకాపేట భూముల సందర్శనకు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేష్‌గౌడ్ నేతృత్వంలోని టీపీసీసీ కమిటీతో కలిసి వెళ్లనున్నట్లు ప్రకటించడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున నుంచి భారీగా పోలీసులను మొహరించారు.

Dalit Bandhu: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం, హుజూరాబాద్ నుంచే దళిత బంధు పథకం అమలు, ప్రత్యేకంగా రూ. 2 వేల కోట్ల ప్రభుత్వ నిధుల ఖర్చు

Vikas Manda

హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈటల రాజేంధర్‌ను ఓడించటానికి ఎన్నో వ్యూహాత్మక అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్, అందులో భాగంగానే 'దళిత బంధు పథకం' పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజవర్గంలోనే అమలుచేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు...

Advertisement

Shobha Hymavathi Quits TDP: టీడీపీకి మరో షాక్‌, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా, పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ ఆవేదన

Hazarath Reddy

Prashant Kishor Joins Congress?: 2024లో మోదీని దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్, ప్రశాంత్ కిషోర్‌తో మంతనాలు, పార్టీలోకి ఎన్నికల వ్యూహకర్త రాకపై కొనసాగుతున్న సస్పెన్స్

Hazarath Reddy

కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ, పార్టీ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి విదితమే. ఈ నేపథయంలో కాంగ్రెస్‌లో ఆయన చేరడంపై (Prashant Kishor Joins Congress?) ఊహాగానాలు పెరిగాయి.

Huzurabad Bypoll: హుజురాబాద్‌‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ, రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి, ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కౌశిక్‌రెడ్డి ఆడియో

Hazarath Reddy

హుజురాబాద్‌ లో (Huzurabad) కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా (Congress Leader Kaushik Reddy Resigns) చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి తన రాజీనామా పత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో సమావేశంలో అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు.

CM Stalin Meets Vijayakanth: విజయకాంత్‌ ఇంటికి సీఎం ఎంకే స్టాలిన్‌, 15 నిమిషాల పాటు కెప్టెన్‌తో గడిపిన తమిళనాడు ముఖ్యమంత్రి, కరోనా నివారణ నిధికి రూ. 10 లక్షల చెక్కును సీఎంకు అందజేసిన విజయకాంత్‌

Hazarath Reddy

డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదివారం పరామర్శించారు. డీఎంకే పార్టీ నేతలు దురైమురుగన్, రాజాలతో కలిసి విరుగంబాక్కంలోని విజయకాంత్‌ ఇంటికి స్టాలిన్‌ వెళ్లారు. విజయకాంత్‌ను శాలువతో సత్కరించారు.

Advertisement
Advertisement