Politics

Motera Political Innings: మోతేరా స్టేడియానికి 'నరేంద్ర మోదీ' స్టేడియంగా పేరు మార్పుపై దుమారం, సర్దార్ పటేల్‌కు జరిగిన అవమానంగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ, పేరు మార్పును సమర్థించుకున్న బీజేపీ

Team Latestly

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్‌లో గల మోమొతేరా స్టేడియం పేరుపై ఇప్పుడు రాజకీయంగా మరియు సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది. ఈ స్టేడియానికి సర్ధార్ పటేల్ స్టేడియం అని కాకుండా నరేంద్ర మోదీ స్టేడియం అని నామకరణం చేయడమే ఇందుకు కారణం....

‘President’s Rule in Puducherry’: ముందుకురాని బీజేపీ, పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేసిన ఇన్‌చార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ఉత్తర్వులు రాగానే పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన

Hazarath Reddy

పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ బల నిరూపణలో విఫలమైన నేపథ్యంలో సీఎం నారాయణ స్వామి రాజీనామాను సమర్పించిన సంగతి విదితమే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ దాని మిత్ర పక్షాలు ఇప్పుడు అక్కడ అంతగా ఆసక్తి చూపడం లేదు.

Assembly Elections 2021: అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, కేంద్ర ఎన్నికల సంఘం నేడు కీలక సమావేశం, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీదనే అందరి కన్ను

Hazarath Reddy

దేశంలో మరో ఎన్నికలకు వెళయింది. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ (Assembly Elections 2021) బుధవారం విడుదల కానుంది. నాలుగు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతోంది. అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు (Assembly Elections of 5 States) జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

Gujarat Civic Polls: ప్రధాని ఇలాకాలో మెరిసిన ఆమ్ ఆద్మీ, గుజరాత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఏఐఎంఐఎం, అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, తర్వాత స్థానంలో కాంగ్రెస్, గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల పూర్తి సమాచారం మీకోసం..

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పాగా వేశారు. ఆదివారం జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో (Gujarat Civic Polls) బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఆప్‌ (AAP) నిలిచింది.

Advertisement

TS Graduate MLC Elections: రెండు స్థానాలకు వందల సంఖ్యలో అభ్యర్థుల పోటీ, తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు, మార్చి14న పోలింగ్, మార్చి17న ఓట్ల లెక్కింపు ప్రక్రియ

Hazarath Reddy

తెలంగాణాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ (TS Graduate MLC Elections) ముగిసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ మూడు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం సాయంత్రం మూడు గంటలకు ముగిసింది.

AP Cabinet Meeting Highlights: ఈబీసీ మహిళలకు మూడేళ్లకు రూ. 45 వేల ఆర్థిక సాయం, అమరావతికి సంబంధించి కీలక నిర్ణయం, ఈ ఏడాది నవరత్నాల పథకాలకు మంత్రి వర్గ ఆమోదం, కేబినెట్‌ భేటీలో ఏపీ సీఎం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో మంగళవారం కొనసాగిన కేబినెట్‌ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు (AP Cabinet Meeting Highlights) కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Puducherry Floor Test: పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం, బల పరీక్షను నిరూపించుకోవడంలో విఫలమైన నారాయణస్వామి సర్కార్, సీఎం రాజీనామా, తదుపరి ముఖ్యమంత్రిపై పెరుగుతున్న ఉత్కంఠ

Hazarath Reddy

పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదేశాలతో బలనిరూపణలో (Puducherry Assembly Floor Test) నారాయణస్వామి ప్రభుత్వం విఫలం అయ్యింది. దీంతో సీఎం పదవికి రాజీనామా ( Puducherry CM Resignation) చేశారు.

AP Local Body Polls: 10,890 మంది సర్పంచ్ లు నేరుగా ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపిన ఎస్ఈసీ, పోలీసుల పని భేష్, ఇదే ఉత్సాహంతో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అందించిన సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతం అయ్యాయని ఆయన (SEC Nimmagadda Ramesh Kumar) తెలిపారు.

Advertisement

AP Local Body Polls: 4వ దశలో కూడా వైసీపీ మద్దతుదారులదే హవా, నాలుగు దశలు కలిపి 81.78 శాతం పోలింగ్ నమోదు, ఈ ఎన్నికల్లో 2.26 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపిన కమిషనర్ గిరిజాశంకర్

Hazarath Reddy

పీలో నాలుగో విడత ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగో విడతలో మొత్తం 82.85 శాతం పోలింగ్ (AP Local Body Polls) నమోదు కాగా నాలుగు దశలు కలిపి 81.78 శాతం నమోదు అయింది.

AP Local Body Polls: ఏపీలో కొనసాగుతున్న నాలుగో దశ పోలింగ్, మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్, సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు, 3,299 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాల్లో 554 మంది ఏకగ్రీవం

Hazarath Reddy

ఏపీలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నాలుగో దశలో 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్‌ (AP Local Body Polls) కొనసాగుతోంది. మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను వెల్లడిస్తారు

Bihar Minister Narayan Prasad: పెట్రోలు ధరలు పెరిగితే మంచిదే, పైగా జనాలు అలవాటు పడతారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ బీజేపీ మంత్రి నారాయణ్ ప్రసాద్, మండిపడుతున్న ప్రతిపక్షాలు

Hazarath Reddy

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యుడి జేబులు గుల్ల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్‌ బీజేపీ మంత్రి నారాయణ ప్రసాద్ (Bihar Minister Narayan Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

YS Sharmila Meeting: షర్మిల నోటి వెంట జై తెలంగాణ నినాదం, దివంగత వైఎస్సార్ పాలనను తీసుకురావడమే లక్ష్యమంటున్న షర్మిలారెడ్డి, హైదరాబాద్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం

Hazarath Reddy

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిలారెడ్డి తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు (YS Sharmila Meeting) నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించగా..నేడు హైదరాబాద్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం (Hyderabad And Rangareddy Leaders) నిర్వహించారు.

Advertisement

AP Panchayat Poll 2021: ఏపిలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు అదనపు మార్గదర్శకాలు జారీ, బ్యాలెట్ కౌంటింగ్ కూడా వీడియో రికార్డింగ్ చేయాలని అధికారులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం

Team Latestly

ఇతరులను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించవద్దని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అంతేకాకుండా, విజేతను ప్రకటించే సమయంలో పది ఓట్ల కంటే తక్కువ తేడా ఉంటే రీకౌంట్ చేయాలని నూతన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.....

Punjab Civic Poll Results 2021: బీజేపీకి ఘోర పరాభవం, పంజాబ్‌లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్టీ, మొత్తం ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థానాలు కైవసం, భారీ స్థాయిలో 71.39 పోలింగ్ నమోదు

Hazarath Reddy

పంజాబ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించింది. మోగా, హోషియార్‌పూర్‌, కపుర్తలా, అబోహర్‌, పఠాన్‌కోట్‌, భటిండా, బాటలా మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థానాలను (Punjab Civic Poll Results 2021) కైవసం చేసుకుంది.

Puducherry Politics: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కిరణ్ బేడి తొలగింపు, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతల అప్పగింత, వేగంగా మారుతున్న పుదుచ్చేరి రాజకీయాలు

Team Latestly

ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గవర్నర్‌ కిరణ్ బేడీతో విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రజాస్యామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని గవర్నర్ పనిచేయనీయడం లేదని, ప్రభుత్వ విధానాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఇటీవల కలిసి గవర్నర్‌కు వ్యతిరేకంగా మెమొరాండం కూడా అందజేశారు......

Mumbai Lockdown News: ముంబైలో మళ్లీ లాక్‌డౌన్? ప్రజలు అప్రమత్తంగా లేకుంటే తప్పదని తెలిపిన ముంబై నగర మేయర్ కిషోరి పండేకర్, దేశ ఆర్థిక రాజధానిలో రోజు రోజుకు పెరుగుతున్న కేసులు

Hazarath Reddy

మహారాష్ట్రలో కరోనావైరస్ మళ్లీ పుంజుకుంది. ముఖ్యంగా రాజధాని ముంబై నగరంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మళ్లీ లాక్‌డౌన్ విధించబోతున్నట్లు పాలకులే సంకేతాలు ఇస్తున్నారు. ముంబై నగరంలో ప్రజలు కోవిడ్ నిబందనలు పాటించడం లేదని, ఇలా అయితే మళ్లీ లాక్‌డౌన్ (Mumbai Lockdown) విధించాల్సి వస్తుందని ముంబై నగర మేయర్ కిషోరి పండేకర్ (Mayor Kishori Pednekar) హెచ్చరించారు.

Advertisement

Puducherry Political Crisis: కిరణ్ బేడి చక్రం తిప్పిందా..కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం, పుదుచ్చేరిలో నలుగురు ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు, ఇప్పటికే రాజీనామా చేసిన యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం నారాయణ స్వామి

Hazarath Reddy

కేంద్రపాలిత ప్రాంతమైనలో ముఖ్యమంత్రి నారాయణస్వామి సర్కార్‌ మైనార్టీలో (Puducherry Political Crisis) పడిపోయింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేశారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే రాజీనామాలు కాంగ్రెస్‌ పార్టీలో అక్కడ కలకలం రేపుతున్నాయి.

BPL Cards in Karnataka: టీవీ, ఫ్రిజ్ ఉంటే రేషన్ కార్డు కట్, వెంటనే ప్రభుత్వానికి కార్డును తిరిగివ్వాలి, లేదంటే చట్టపరంగా చర్యలు తప్పవు, కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం, మండిపడుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

ద్విచక్ర వాహనం, టీవీ, ఫ్రిజ్ లేదా ఐదు ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్న వారికి రేషన్ కట్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీపీఎల్‌ కార్డుల (BPL Cards in Karnataka) మంజూరు విషయంలో ఇకపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించదని ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖమంత్రి ఉమేష్‌ కత్తి స్పష్టం చేశారు. సోమవారం బెళగావిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

‘BJP in Srilanka &Nepal’: శ్రీలంక, నేపాల్‌లో బీజేపీ పార్టీ ఏర్పాటు చేస్తాం, అమిత్ షా కోరిక అదే, సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ దేబ్, ప్రపంచవ్యాప్తంగా బీజేపీ అవసరం ఉందని తెలిపిన సీఎం

Hazarath Reddy

పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంకలలో బిజెపిని విస్తరించాలని (BJP in Srilanka &Nepal) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కోరుకుంటున్నారని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ (Tripura CM Biplab Deb) శనివారం అన్నారు. అగర్తాలాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి త్రిపుర ముఖ్యమంత్రి తన రాష్ట్ర పర్యటన సందర్భంగా బిజెపి భారత సరిహద్దులకు మించి విస్తరించాలని హోం మంత్రి కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

CM Vijay Rupani Collapses on Stage: స్టేజ్ మీదనే హఠాత్తుగా కుప్పకూలిన గుజరాత్ సీఎం, అహ్మదాబాద్‌ ఆసుపత్రికి విజయ్ రూపానీని తరలింపు, ఇతర బహిరంగ సభలను రద్దు, మునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు

Hazarath Reddy

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (64) వేదికపైనే హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వడోదరలోని నిజాంపుర ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సందర్భంలో అస్వస్థతకు గురైన ఆయన (CM Vijay Rupani Collapses on Stage) స్టేజ్‌పైనే పడిపోయారు.

Advertisement
Advertisement