రాజకీయాలు

'Maha' Fever - Maha Danger: ఈ 'మహా' రాజకీయాలు భరించలేను బాబోయ్, వీటితో షాక్ తిన్నాను, దయచేసి నాకు సెలవు ఇవ్వండి మహాప్రభో అంటూ ప్రొఫెసర్ వేడుకోలు, వైరల్ అవుతున్న లీవ్ లెటర్

Vikas Manda

ఈ రాజకీయ దెబ్బలకు సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. మరి అవ్వారా? ఏ సస్పెన్స్ థిల్లర్ సినిమాలో లేనటువంటి ట్విస్టులు, నరాలు తెగే ఉత్కంఠత, ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ దెబ్బతో ఓ ప్రొఫెసర్ షాక్ కు గురయి మంచాన పడ్డాడట....

TSRTC Row: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం షాక్ ! సమ్మె విరమణ హాస్యాస్పదం, ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదు, లేబర్ కోర్టులో తేలిన తర్వాతే నిర్ణయమన్న ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ

Vikas Manda

కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. అయితే ఇంతలోనే వారికి ప్రభుత్వం నుంచి షాక్ తగిలింది.....

TSRTC Strike Called-off: ఆర్టీసీ సమ్మె విరమణ, రేపట్నించి విధుల్లోకి హాజరుకావాలని నిర్ణయం, భవిష్యత్ కార్యాచరణ అని చెప్పి ట్విస్ట్ ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం

Vikas Manda

తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె విరమించామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా "ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదు, ప్రభుత్వం గెలవలేదు" అంటూ వ్యాఖ్యానించారు....

Joy Prakash Majumdar: రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్‌ను చితకబాదిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, దారుణంగా కాలితో తన్నుతూ దాడి, ఎస్పీని సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్

Vikas Manda

బీజేపీ నేతలు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. 50 మంది టీఎంసీ రౌడీలు తమ అభ్యర్థిని చుట్టుముట్టి చితకబాదారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు పోలీసుల భద్రతా వైఫల్యమే కారణమని....

Advertisement

Maharashtra Irrigation Scam Case: రూ.70 వేల కోట్ల స్కాంలో కీలక మలుపు,అజిత్ పవార్‌ మీద ఉన్న కేసు కొట్టివేత, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిపోర్ట్, కేసు మూయలేదంటున్న ఏసీబీ డైరక్టర్ పరంబీర్ సింగ్

Hazarath Reddy

బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమలుపుకి కారణమైన అజిత్‌ పవార్‌ (Ajit Pawar) సహా ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌(Sharad Pawar)పైనా, ఇతర నేతలపైనా అనేక అవినీతి ఆరోపణలున్న సంగతి విదితమే. అజిత్‌ పవార్‌ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలెదుర్కొంటున్నారు.

Fadnavis Takes Over As CM: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఫడ్నవిస్, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్‌పై తొలి సంతకం,24 గంటల్లో బలాన్ని నిరూపించుకోవాలన్న సుప్రీంకోర్టు

Hazarath Reddy

హారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతుంటే బీజేపీ మాత్రం కూల్ గా తన పని తాను చేసుకోపోతోంది. అనూహ్య ట్విస్టుల మధ్య మహారాష్ట్ర ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis) ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫడ్నవీస్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్‌(CM relief fund cheque)పై తన తొలి సంతకాన్ని చేశారు.

Politics Of Maharashtra: లెమన్ ట్రీ హోటల్‌కు శివసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలను భద్రపరుచుకునే పనిలో బిజీ అయిన మూడు పార్టీలు, ఫ్లోర్ టెస్టుకు రెఢీ అంటున్న బీజేపీ, సత్తా చూపమంటున్న మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాల(Maharashtra politics)పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. రేపు బిజేపీ తమ బలాన్ని నిరూపించుకోనున్ననేపథ్యంలో మూడు పార్టీలు తమ ఎమ్మెల్యేలను చేజారిపోనీకుండా సీక్రెట్ ప్రదేశాలకు( (Shiv Sena MLAs moved to resorts) తరలిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు మహాలో రిసార్ట్ పాలిటిక్స్ మొదలయ్యాయి.

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, ఆలయాలకు విధిస్తున్న పన్నులపై నిలదీత, భాషాసంస్కృతులపై వరుస ట్వీట్లు

Vikas Manda

పవన్ తన ట్వీట్లలో, ప్రసంగాల్లో ఎక్కువగా భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలు, ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు....

Advertisement

Murder Of Democracy In Maharashtra: పార్లమెంట్‌లో ప్రకంపనలు, ప్రజాస్వామ్యాన్ని హత్యచేశారన్న రాహుల్ గాంధీ, మహారాష్ట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ బయట కాంగ్రెస్ పార్టీ నిరసన

Hazarath Reddy

మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పార్లమెంటులో వేడిని పుట్టిస్తున్నాయి. బీజేపీ ఖూనీ రాజకీయాలు చేస్తుందంటే పార్లమెంటులో కాంగ్రెస్ ఆందోళన బాట(Cong Holds Protests Outside Parliament) పట్టింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) పార్టీ ఎంపీలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యానర్లతో నిరసనలో పాల్గొన్నారు.

'MAHA' Twist: 24 గంటల్లోగా బలం నిరూపించుకోవాలి, బల నిరూపణ జరగాల్సింది గవర్నర్ వద్ద కాదు అసెంబ్లీలో, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, కొనసాగుతున్న వాదనలు

Hazarath Reddy

మహారాష్ట్ర (Maharashtra) నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 24 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్ష జరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలో కానీ, గవర్నర్‌ వద్ద కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Maharashtra Political Drama: బలం నిరూపించుకోమంటే బీజేపీ పారిపోతోంది, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చౌహాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు, ఎవరిబలమేంటో తేల్చుకుందామని బీజేపీకి చురకలంటించిన కాంగ్రెస్ సీనియర్ నేత

Hazarath Reddy

మహావార్ మరింతగా ముదిరింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress) సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పై మరింతగా తన దూకుడును పెంచింది. మహారాష్ట్ర అసెంబ్లీలో బలం నిరూపించాల్సిందిగా బీజేపీని కోరితే ఆ పార్టీ పారిపోతోందని ( BJP is "running away)కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది.

Coats For Cows In Ayodhya: అయోధ్యలో ఆవులకు చలికోట్లు, మున్సిపల్ కార్పోరేషన్ సంచలన నిర్ణయం, 700 ఎద్దులతో సహా మొత్తం 1200 పశువులకు కోట్లు, మొత్తం మూడు,నాలుగు దశల్లో అమలు చేస్తామన్న మున్సిపల్ కమిషనర్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య మున్సిపల్ కార్పోరేషన్ (Ayodhya Municipal Corporation) ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. అయోధ్య మునిసిపల్ అధికారులు పట్టణంలోని ఆవులను చలి నుంచి కాపాడేందుకు వాటికి చలికోట్లు కుట్టిస్తున్నారు. జనపనారతో వీటిని తయారు చేస్తున్నారు.

Advertisement

YS Jagan Assets Case: ఏపీ సీఎంకు ఊరట, కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎనిమిదేళ్ల నుంచి విచారణ ఎదుర్కుంటున్న ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM Jagan)పై ఆదాయానికి మించిన ఆస్తులు (illegal assets case) ఉన్నాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుల విచారణ విషయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ( The Special CBI court) వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్‌ జగన్‌ కు మినహాయింపు ఇచ్చింది.

Maharashtra Battle: అజిత్ పవార్ ట్వీట్ కలకలం, భగ్గుమన్న శరద్ పవార్, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదన్న ఎన్సీపీ అధినేత, బల పరీక్షపై రేపు సుప్రీంకోర్టు తీర్పు

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Political Battle) రోజు రోజుకు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. నిన్నటిదాకా సీఎం పీఠం వేదికగా రాజకీయాలు నడిస్తే ఇప్పుడు ఆ రాజకీయాలు బల నిరూపణ వైపు మలుపు తిరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ బహిష్కృత నేత, మహారాష్ట్ర ఉపమఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్‌ పవార్‌ (Ajit Pawar) చేసిన ట్వీట్ మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

Sena Supporter Attempts Suicide: ఆత్మహత్యకు పాల్పడిన శివసేన కార్యకర్త, మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై మనస్థాపం, ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదనే బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారన్న పోలీసులు, మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో ఘటన

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాలను పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ కార్యకర్తలు ఖుషీలో ఉంటే శివసేన,ఎన్సీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మహా రాజకీయ పరిణామాలతో మనస్తాపం చెందిన శివసేన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం(Shiv Sena supporter attempts suicide) రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

TSRTC Strike To Continue: సమ్మె యధాతథంగా కొనసాగుతుంది,సేవ్‌ ఆర్టీసీ పేరుతో అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిన తరువాత భవిష్యత్ కార్యాచరణ, మీడియాతో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

Hazarath Reddy

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు(TSRTC Employees Union) చేపట్టిన సమ్మె (TSRTC Strike) నేటికి 51వ రోజుకు చేరుకుంది. ఇటీవల విధుల్లో చేరేందుకు కార్మికులు మొగ్గు చూపినా ప్రభుత్వం (Telangana govt) నుంచి స్పందన లేకపోవడంతో సమ్మె కొనసాగుతోంది.

Advertisement

Mann Ki Baat: నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు, అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశ ప్రజలు ఎంతో సంయమనం చూపారు, విద్యార్థులు పుస్తకాలు వదిలేసి గూగుల్ వెంట పడుతున్నారు,మనసులో మాట కార్యక్రమంలో ప్రధాని మోడీ

Hazarath Reddy

మన్‌ కీ బాత్‌ ద్వారా ప్రధాని మోడి దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి వస్తానని తన బాల్యంలో అనుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అన్నారు. తాను ఆధ్యాత్మిక మార్గంలోనే వెళ్లాలనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని మన్ కీ బాత్(Mann Ki Baat)లో చెప్పారు.

Maharashtra Political Drama: గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు, ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు,రేపు బలపరీక్షపై తీర్పు ఇవ్వనున్న దేశ అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

మహారాష్ట్ర(Maharashtra)లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ, అశోక్ భూషణ్, సంజీవ్ ఖన్నా( N.V. Ramana, Ashok Bhushan and Sanjiv Khanna)తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

Maharashtra Politics: 10 నిమిషాల్లో మెజార్టీని ప్రూవ్ చేసుకుంటాం, తప్పుడు పత్రాలతో సీఎం పీఠం ఎక్కారు, బలపరీక్షకు సిద్ధమన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎమ్మెల్యేలను సీక్రెట్ ప్రదేశానికి తరలించిన మూడు పార్టీలు

Hazarath Reddy

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర(Maharashtra)లో బీజేపీ(BJP) ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. శివసేన(Shivsena), కాంగ్రెస్(Congress), ఎన్సీపీ (NCP) కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఫడ్నవిస్ (Devendra Fadnavis) సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని మహారాష్ట్ర ప్రజలకే తెలియదని అన్నారు.

Chandrababu Praises Amit Shah: అమిత్‌ షాకు చంద్రబాబు ధన్యవాదాలు, చంద్రబాబు ట్వీట్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు, అమరావతిని రాజధానిగా చూపిస్తూ కొత్త ఇండియా మ్యాప్ విడుదల చేసిన హోంశాఖ

Hazarath Reddy

నవ్యాంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా చూపిస్తూ దేశ పటాన్ని సరిదిద్ది విడుదల చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Home Minister Amit Shah)కు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(TDP chief N Chandrababu Naidu) ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన అమిత్‌ షాకు శనివారం ఒక లేఖ(Mr Naidu's letter to the Home Minister) రాశారు.

Advertisement
Advertisement