Politics
Chandrababu Slams CM Jagan: వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు, కొవ్వూరు ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, పెన్సన్ కోసం వెళ్లిన వృద్ధులు చనిపోవడంపై ఏమన్నారంటే..
Hazarath Reddyఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ పార్టీ ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మీద మండిపడ్డారు.
Amanchi Krishna Mohan Quits YCP: వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్, ఈ నెల 9న తన భవిష్యత్ ప్రకటిస్తానని వెల్లడి
Hazarath Reddyఎన్నికల వేళ బాపట్ల జిల్లా చీరాలలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. చీరాల వైసీపీ టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ ప్రకటిస్తానని ఆమంచి వెల్లడించారు.
CM Jagan Speech in Naidupeta: మళ్ళీ అధికారంలోకి వస్తే తొలి సంతకం వాలంటీర్‌ వ్యవస్థ పైనే, నాయుడుపేట మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్
Hazarath Reddyసీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. తిరుపతి జిల్లా పరిధిలో గురువారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. సాయంత్రం నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు
Gourav Vallabh Joins BJP: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది సేపటికే బీజేపీలో చేరిన గౌరవ్‌ వల్లభ్‌, వీడియో ఇదిగో..
Hazarath Reddyకాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ (Gourav Vallabh) గంటల వ్యవధిలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వల్లభ్‌ బీజేపీలో చేరారు.
Gourav Vallabh Quits Congress: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేనంటూ గౌరవ్ వల్లభ్ పార్టీకి రాజీనామా, మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌పై వేటు
Hazarath Reddyలోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గౌరవ్ వల్లభ్ పార్టీకి రాజీనామా చేశారు. తాను సనాతన ధర్యానికి వ్యతిరేక నినాదాలు చేయలేనని, ఇకపై పార్టీలో కొనసాగలేనని ప్రకటించారు.
Sanjay Singh Released From Tihar Jail: జైలు నుంచి విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్‌, ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని, పోరాటం చేయాల్సిన సందర్భమని వెల్లడి
Hazarath Reddyఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి విదితమే. దీంతో ఆయన తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.
Andhra Pradesh Elections 2024: చంద్రబాబు మనిషా శాడిస్టా, పూతలపట్టులో సీఎం జగన్ తీవ్ర విమర్శలు, ఈసీకి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపాటు
Hazarath Reddyవచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ పార్టీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 7వ రోజు కొనసాగుతోంది. 7వ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ (CM Jagan Speech in Memantha Siddham Puthalapattu) మాట్లాడారు.
Vijender Singh Joins BJP: కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరిన బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyలోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్ బుధ‌వారం బీజేపీలో చేరారు.ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో సీనియ‌ర్ నేత‌ల స‌మ‌క్షంలో విజేంద‌ర్ సింగ్ కాషాయ పార్టీలో చేరారు.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు, వయనాడ్‌ నుంచి నామినేషన్‌ వేసిన రాహుల్‌ గాంధీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyకాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి బుధవారం నామినేషన్‌ వేశారు. వయనాడ్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. ఈ క్రమంలోనే నేడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.
Sushil Kumar Modi Cancer Diagnosis: గత ఆరు నెలల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్న సుశీల్ కుమార్ మోదీ, లోక్‌సభ ఎన్నికల కోసం ఏమీ చేయలేనని తెలిపిన బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి
Hazarath Reddyబీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో స్వయంగా తెలియజేశారు. ఇప్పుడు తన అనారోగ్యం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తాను లోక్‌సభ ఎన్నికల కోసం ఏమీ చేయలేనని, అన్ని విషయాలు ప్రధానికి తెలియజేశానని దానిలో పేర్కొన్నారు.
Arvind Kejriwal Health Update: తీహార్ జైల్లో కేజ్రీవాల్‌కు ముప్పు, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆప్, 4.5 కేజీల బరువు తగ్గారని వెల్లడి
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) అనారోగ్యంతో ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు తెలిపాయి. తీహార్‌ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ ఆరోగ్యం సరిగా లేదని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు.
Security Commando Collapses on Stage: సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రసంగిస్తుండగా కుప్పకూలి స్టేజీ మీద పడిపోయిన కమాండో, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఏప్రిల్ 2, మంగళవారం నాడు పిలిభిత్‌లో యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తున్న సమయంలో ఊహించని పరిణామంలో, అతని వెనుక మోహరించిన భద్రతా కమాండో అకస్మాత్తుగా వేదికపై కుప్పకూలిపోయాడు.
CM Revanth Reddy Slams KCR: పదేళ్ల కేసీఆర్‌ పాలనలో వందేళ్ల విధ్వంసం, బీఆర్ఎస్ అధినేతపై మండిపడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyరానున్న లోక్‌సభ ఎన్నిలకు తుక్కుగూడ వేదిక నుంచే కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణకు ఇవ్వనున్న ప్రత్యేక నిధులు, అనుమతులను అందులో పొందుపరుస్తామని చెప్పారు.
Telangana Elections 2024: రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా? కడియం శ్రీహరిని రాళ్లతో కొట్టాలా?, తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశ్నించిన మందకృష్ణ మాదిగ
Hazarath Reddyరాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయకుండా వస్తున్న ఎమ్మెల్యేలను ఎలా పార్టీలో చేర్చుకుంటున్నావు అని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా?.. కడియం శ్రీహరిని రాళ్లతో కొట్టాలా? ఇప్పుడు నీవే చెప్పు ముఖ్యమంత్రి అంటూ మండిపడ్డారు.
Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికలు, ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ఎన్నికల సంఘం
Hazarath Reddyఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ( central election commission) బదిలీ చేసింది. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని రాష్ట ఎన్నికల సంఘం సీఈవో ఎంకే మీనాను ఆదేశించింది
Telangana Elections 2024: వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య, మిగతా మూడు స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
Hazarath Reddyవరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.
Andhra Pradesh Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే 114 మంది అభ్యర్థులు వీరే, శింగనమల నుంచి మాజీ మంత్రి శైలజానాథ్‌ పోటీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు లోక్‌సభ, 114 మంది ఎ‍మ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ మంగళవారం(ఏప్రిల్‌ 2) విడుదల చేసింది.అసెంబ్లీ టికెట్లు పొందినవారిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలున్నారు.
Pension Distribution in Andhra Pradesh: పెన్సన్ ఇంటికి రాదేమోననే భయంతో ఇద్దరు గుండెపోటుతో మృతి, పెన్సన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీలో ఇప్పుడు పెన్సన్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఏపీలో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది.
Andhra Pradesh Elections 2024: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, కడప నుంచి ఎంపీగా బరిలో వైఎస్ షర్మిల
Hazarath Reddyలోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.
Delhi Excise Policy Case: తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఏప్రిల్‌ 15వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన రౌస్‌ అవెన్యూ కోర్టు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీ తాజాగా ముగిసింది. దీంతో ఈడీ ఆయన్ని ఈ ఉదయం ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనకు ఏప్రిల్‌ 15వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో పాటు తీహార్‌ జైలుకు తరలించాలని ఆదేశించింది.