Politics
Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, చంద్రబాబుపై నరసాపురం ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు, నమ్ముకున్నోడికి సీటు ఇప్పించలేదు. మిమ్మల్ని ఎలా నమ్ముతారంటూ..
Hazarath Reddyనరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు సంబంధించిన డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామకృష్ణరాజు.. తన సీటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీటు ఇవ్వాలి.. విజయనగరం వదిలేయండి. టీడీపీ నాకు సీటు ఇవ్వాలి
Andhra Pradesh Elections 2024: సైకిల్ గుర్తుకి ఓటు వేయమని చెప్పగానే వెళ్లిపోయిన జనం, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం, వీడియో ఇదిగో..
Hazarath Reddyనెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నిండు సభలో చేదు అనుభవం ఎదురైంది. సైకిల్ గుర్తుకి ఓటు వేయమని అడగ్గానే జనం అక్కడి నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డి ఎక్కడికి వెళ్లిపోతున్నారు ఉండండి అనడం వీడియోలో కనిపిస్తోంది.
Andhra Pradesh Elections 2024: అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు, మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధ, అధికారికంగా ప్రకటించిన వైసీపీ
Hazarath Reddyఅనకాపల్లి లోక్‌సభ స్థానానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి పేరును వైఎస్సార్‌సీపీ అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తీహార్ జైలుకు కవిత, ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం, కోర్టులో వాదనలు ఎలా సాగాయంటే..
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 14 రోజుల పాటు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది ట్రయల్‌ కోర్టు.దీంతో ఆమెను తీహార్‌ జైలుకు అధికారులు తరలించనున్నారు. లిక్కర్‌ స్కాం కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.
Delhi Excise Policy Case: ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు, కడిగిన ముత్యంలో బటయకు వస్తానని తెలిపిన ఎమ్మెల్సీ కవిత
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది మనీ లాండరింగ్‌ కేసు కాదని, పొలిటికల్‌ లాండరింగ్‌ కేసని విమర్శలు గుప్పించారు.
No BJP-SAD Alliance in Punjab: పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగా పోటీ, కీలక ప్రకటన చేసిన బీజేపీ చీఫ్ సునిల్ జ‌ఖార్, శిరోమ‌ణి అకాలీద‌ళ్‌తో పొత్తు ఉండబోదని స్పష్టం
Hazarath Reddyరాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పంజాబ్ నుంచి ఒంట‌రిగానే పోటీ చేస్తున్నట్లు బీజేపీ చీఫ్ సునిల్ జ‌ఖార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల కోసం శిరోమ‌ణి అకాలీద‌ళ్‌తో పొత్తు పెట్టుకోనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడింది
Arvind Kejriwal’s Second Order: ఈడీ క‌స్ట‌డీ నుంచే రెండో ఆదేశం ఇచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, మొహ‌ల్లా క్లినిక్‌ల్లో మందుల కొరత లేకుండా చూడాలని సూచన
Hazarath Reddyఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్(CM Kejriwal) ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న ఈడీ కస్టడీ నుంచి రెండోసారి ఆరోగ్య శాఖ‌కు కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల‌ను ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి సౌర‌భ భ‌ర‌ద్వాజ్‌కు క‌మ్యూనికేట్ చేశారు.
Andhra Pradesh Elections 2024: తిరుపతి టికెట్ జనసేనకు ఇవ్వడంతో ఏడ్చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని సూటి ప్రశ్న
Hazarath Reddyతిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. జనసేన నుంచి ఆరని శ్రీనివాసులుకు టికెట్‌ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టికెట్‌ దక్కలేదని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశామని, తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరమని అన్నారు.
Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, అధికారంలోకి రాగానే మద్యం ధరలు తగ్గిస్తామని తెలిపిన చంద్రబాబు
Hazarath Reddyతెలుగు తమ్ముళ్లు ఎవరికీ భయపడబోరని, అడ్డొస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుకుంటూ వెళతామే తప్ప, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మేము అధికారంలోకి రాగానే మద్యం ధరలు తగ్గిస్తామని నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
Andhra Pradesh Elections 2024: టీడీపీ అధికారంలోకి వస్తే రూ. 4 వేలు పెన్సన్, కుప్పంలో చంద్రబాబు సంచలన ప్రకటన, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమని వెల్లడి
Hazarath Reddyఏపీలో అరాచక పాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. మూడు పార్టీల అజెండా ఒక్కటేనని... రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు (Chandrababu Naidu ) ఉద్ఘాటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని అన్నారు.
Andhra Pradesh Elections 2024: జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు రఘురామ కాదు, ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు, నరసాపురం సీటు నాకు రాకుండా అడ్డుకున్నారని మండిపాటు
Hazarath Reddyటీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా ఏపీలోని 6 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. రఘురామకృష్ణంరాజు సిట్టింగ్ ఎంపీగా ఉన్న నరసాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేరును అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే.
Lok Sabha Elections 2024: బీఆర్ఎస్ నుండి పోటీలో ఉన్న 17 మంది ఎంపీ అభ్యర్థులు వీళ్లే, హైదరాబాద్‌ నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ పోటీ
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ (BRS) మొత్తం ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. తాజాగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించారు
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు, కాంగ్రెస్ ఆరో జాబితా విడుద‌ల, కోటా నుంచి ప్రహ్లాద్ గుంజ‌ల్ పోటీ, పూర్తి లిస్టు ఇదిగో..
Hazarath Reddyలోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధ‌ుల ఆరో జాబితాను కాంగ్రెస్ సోమ‌వారం విడుద‌ల చేసింది. రాజ‌స్ధాన్‌లోని అజ్మీర్ నుంచి రామచంద్ర చౌద‌రి, రాజ్‌స‌మంద్ నుంచి సుద‌ర్శ‌న్ రావ‌త్‌ను, భిల్వారా నుంచి డాక్ట‌ర్ రామ‌చంద్ర గుర్జ‌ర్‌ను బ‌రిలో దింపింది. ఆరో జాబితాలో కోటా నుంచి ప్రహ్లాద్ గుంజ‌ల్, త‌మిళ‌నాడులోని తిరునల్వేల్ నుంచి డాక్టర్ రాబ‌ర్ట్ బ్రూస్‌ల‌కు చోటు క‌ల్పించింది.
POK Will Merge With India: పీవోకే భారత్‌లో ఎప్పటికైనా విలీనమవుతుంది, విశ్వాసం వ్యక్తం చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyపాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే)ని భారత్‌లో విలీనమవుతుందన్న విశ్వాసాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యక్తం చేశారు, ఎందుకంటే అక్కడి ప్రజలు ఆ డిమాండ్‌ను లేవనెత్తారు. భారత్‌లో విలీనం కావాలని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) ప్రజల నుంచే స్వయంగా డిమాండ్లు వస్తున్నాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.
Gali Janardhana Reddy Back in BJP: మళ్లీ బీజేపీలో చేరిన గాలి జనార్దన్‌ రెడ్డి, నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు కృషి చేస్తానని వెల్లడి
Hazarath Reddyకల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కెఆర్‌పిపి) నాయకుడు జి జనార్దన రెడ్డి సోమవారం తన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు మరియు లోక్‌సభకు ముందు తన భార్య అరుణ లక్ష్మితో కలిసి పార్టీలో తిరిగి చేరారు. పార్టీ నేత బీఎస్ యడ్యూరప్ప , రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర సమక్షంలో పార్టీలో చేరారు .
Nara Lokesh Fire on Police: డీజీపీని తమాషాలు ఆడొద్దని చెప్పండంటూ పోలీసులకు నారా లోకేష్ వార్నింగ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyపోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు.. వైఎస్సార్‌సీపీ నేతల కార్లు ఎందుకు ఆపి సోదాలు చేయడం లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అన్నారు.
Lok Sabha elections 2024: ఐదో జాబితా విడుదల చేసిన బీజేపీ.. కంగనా రనౌత్‌ కు టికెట్‌.. మేనకా గాంధీ, జితిన్‌ ప్రసాద, రవిశంకర్ ప్రసాద్‌, నవీన్‌ జిందాల్‌ కు కూడా..
Rudraలోక్‌ సభ ఎన్నికల కోసం అధికార బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. 111 లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కు టికెట్ ఇచ్చింది.
Arvind Kejriwal Arrested: ఢిల్లీ లిక్కర్ కేసు, ఆరు రోజుల ఈడీ కస్టడీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్, మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కీలక సూత్రధారి అని ఆరోపించిన ఈడీ
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ విధానం కేసులో ఆప్‌ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను 6 రోజుల ఈడీ కస్టడీకి రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది.
Arvind Kejriwal Arrested: ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్, ఎక్కడ ఉన్నా నా జీవితం దేశానికే అంకితమని తెలిపిన ఢిల్లీ సీఎం
Hazarath Reddyలిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఈడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు.. కేజ్రీవాల్‌ను 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది.
Andhra Pradesh Elections 2024: రాజకీయాల్లో ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థం అయ్యిందంటూ ఉండవల్లి శ్రీదేవి సంచలన ట్వీట్, వారిని ఉద్దేశించి పెట్టిందా అంటూ చర్చలు
Hazarath Reddyరాజకీయాలు ఎలా ఉంటాయో... ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది అంటూ తాడికొండ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు తెర లేపింది. బాపట్ల అని హ్యాష్ ట్యాగ్ పెట్టి కత్తి ఎమోజీ పోస్టు చేయడంతో ఇంకా ఆసక్తికరంగా మారింది.