Rajasthan Assembly Elections (Credits: X)

Jaipur, Nov 25: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగియగా, నేడు రాజస్థాన్‌ ఎన్నికల (Rajasthan Assembly Elections) ఓటింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ (Polling) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. రాష్ట్రంలోని మొత్తం 200 సీట్లకుగాను 199 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతున్నది. కరన్‌పూర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే గుర్మీత్‌ సింగ్‌ కూనార్‌ (Gurmeet Singh Koonar) మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదాపడింది. 199 స్థానాలకు గాను 1862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 5.25 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

Good News for TS Voters in AP: ఏపీలోని తెలంగాణ ఓటర్లకు శుభవార్త.. 30న వేతనంతో కూడిన సెలవు

సిట్టింగ్  లకు అగ్రతాంబూలం

59 మంది సిట్టింగ్‌ లకు ప్రతిపక్ష బీజేపీ మరోసారి అవకాశం ఇవ్వగా, కాంగ్రెస్‌ పార్టీ 97 మంది ఎమ్మెల్యేలను మళ్లీ బరిలో నిలిపింది. పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే ఉన్నా.. సీపీఎం, ఆర్‌ఎల్‌పీ, భారత్‌ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్‌ పార్టీ, ఆప్‌, ఎంఐఎం కూడా బరిలో నిలిచాయి. కాంగ్రెస్‌, బీజేపీలకు 40 స్థానాల్లో రెబెల్స్‌ నుంచి పోటీ ఎదురవుతున్నది. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

Rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తెలంగాణలో మరో 3-4 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..