File: Google

భారత్ లో చంద్రగ్రహణం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం పాక్షికంగా కనిపించింది. ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు మొదలైన గ్రహణం.. సాయంత్రం 5 గంటల 40 నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు నదీ స్నానాలు ఆచరించారు.

ఈ ఏడాది ఇదే చివరి గ్రహణం.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి చంద్రగ్రహణం కనిపించింది. కోల్ కతా, గౌహతిలో గ్రహణం సంపూర్ణంగా కనిపించింది. కోల్ కతాలో గంట 27 నిమిషాలు.. గౌహతిలో గంట 45 నిమిషాలు చంద్రగ్రహణం ఏర్పడింది. అలాగే దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో పాటు పసిఫిక్ మహాసముద్రాలను కవర్ చేసే ప్రాంతంలో ఈ గ్రహణం కనిపించింది. 2023 అక్టోబర్ 28న మరోసారి చంద్రగ్రహణం ఏర్పడనుంది.