representational image. |(Photo-ANI)

Lucknow, Feb 6: మూడు దశాబ్దాల నాటి లంచం కేసులో 82 ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి (Retired Railway Employee) కోర్టు ఏడాది జైలు శిక్ష (One Year Jail) విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) లక్నోలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర రైల్వేలో లోకో డ్రైవర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన రామ్‌కుమార్ తివారి 1991లో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇందుకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ కోసం రైల్వే డాక్టర్ రామ్‌నారాయణ్ వర్మ వద్దకు వెళ్లగా టెస్టులు చేసి సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఆయన రూ. 150 డిమాండ్ చేశారు.

టర్కీ, సిరియాలో భారీ భూకంపం.. 7.8 తీవ్రతతో భూకంపం.. పలు భవనాలు ధ్వంసం.. వీడియోతో

దీంతో రామ్‌కుమార్ తప్పని పరిస్థితుల్లో రూ. 50 ఇచ్చారు. మిగతా రూ 100 ఇవ్వడానికి ముందు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన  రూ. 100 ఇస్తుండగా సీబీఐ అధికారులు కాపుకాసి రెడ్‌హ్యాండెడ్‌గా వర్మను పట్టుకున్నారు. అప్పటి నుంచి వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసులో ఎట్టకేలకు తీర్పు వచ్చింది. కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ విక్రమ్ సింగ్.. వర్మను దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా వర్మ తన వయసును దృష్టిలో పెట్టుకోవాలన్న అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు.

అల్లు అర్జున్ కు ఊహించని కానుక.. పుష్ప లారీ బొమ్మ కానుకగా ఇచ్చిన తనయుడు అయాన్