వైరల్

Glenn Phillips Catch Video: సోషల్‌మీడియాను షేక్‌ చేస్తోన్న గ్లెన్‌ ఫిలిప్స్‌ క్యాచ్, కళ్లు చెదిరే విన్యాసం చేసి సిక్సర్‌ వెళ్లకుండా అడ్డుకున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా డంబుల్లా సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్‌ ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌ ఆరో ఓవర్‌లో కుశాల్‌ పెరీరా కొట్టిన భారీ షాట్‌ను ఫిలిప్స్‌ కళ్లు చెదిరే విన్యాసం చేసి సిక్సర్‌ వెళ్లకుండా అడ్డుకున్నాడు.

James Anderson Wicket Video: జేమ్స్ అండర్సన్ అవుట్-స్వింగింగ్ డెలివరీ వీడియో ఇదిగో, జాషువా డా సిల్వాను పెవిలియన్ సాగనంపిన ఇంగ్లండ్ స్పీడ్ స్టర్

Vikas M

ఇంగ్లండ్ జాతీయ క్రికెట్ జట్టు తరపున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన జేమ్స్ ఆండర్సన్ ఈ ఫార్మాట్‌లో తన 704వ వికెట్‌ను సాధించాడు. అతను ట్రేడ్‌మార్క్ అవుట్-స్వింగింగ్ డెలివరీతో జాషువా డా సిల్వాను అవుట్ చేశాడు.

James Anderson Retires: నా బెస్ట్ బ్యాటర్ సచిన్, చెత్త బంతులు వేస్తే బౌండరీ లైన్ అవతలే, జేమ్స్ అండ‌ర్స‌న్ కీలక వ్యాఖ్యలు

Vikas M

తన బౌలింగ్‌ ఎదుర్కొన్న వారిలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అత్యుత్తమ బ్యాటర్‌ అంటూ ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు ద్వారా తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలుకబోతున్న అండర్సన్‌ తన అనుభవాలను పంచుకున్నాడు. ‘నేను చూసిన అత్యుత్తమ బ్యాటర్లలో సచిన్‌ టెండ్కూలర్‌.

James Anderson Retires: క్రికెట్ చరిత్రలో ముగిసిన యోధుడి ప్రస్థానం, టెస్ట్‌ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన జేమ్స్ అండ‌ర్స‌న్, ఎమోషనల్‌ అయిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్

Vikas M

ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జేమ్స్ అండ‌ర్స‌న్ తన 22 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్‌ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 12) ముగిసిన టెస్ట్‌ మ్యాచ్‌ ఆండర్సన్‌ కెరీర్‌లో చివరిది. తన చివరి మ్యాచ్‌ను జిమ్మీ గెలుపుతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు.

Advertisement

Zomato: కస్టమర్‌కు అనుకున్న టైంకు డెలివరీ ఇవ్వలేదని జొమోటోకు రూ. 60 వేలు ఫైన్, కర్ణాటక వినియోగదారుల ఫోరం కీలక తీర్పు

Vikas M

కస్టమర్‌కు అనుకున్న సమయంలో మోమోస్ ఆర్డర్‌ను డెలివరీ చేయడంలో విఫలమైనందుకు రూ. 60,000 పరిహారం చెల్లించాలని ధార్వాడ్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జొమాటోని ఆదేశించింది. ధార్వాడ్ నివాసి శీతల్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌పై ఫిర్యాదు చేయడంతో జూలై 3న కోర్టు పై తీర్పును వెలువరించింది.

T-Square Building in Hyderabad: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ మాదిరిగా హైద‌రాబాద్‌లో టీ స్క్వేర్‌, టెండర్లను ఆహ్వానించిన టీజీఐఐసీ

Hazarath Reddy

రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో టి స్క్వేర్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు టీజీఐఐసీ టెండర్లు ఆహ్వానించింది.

Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, మామిడి కాయలు కోసారని ముగ్గురు పిల్లలను చెట్టుకు కట్టేసిన యజమాని, అరవకుండా నోట్లో మామిడికాయలు కుక్కి..

Hazarath Reddy

ఓ షాకింగ్ సంఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో శబ్దాలు చేయకుండా ఉండటానికి ముగ్గురు పిల్లలను చెట్టుకు కట్టి, అరవకుండా వారి నోటిలో మామిడికాయలు కుక్కినందుకు ఒక పొలం యజమానిని అరెస్టు చేశారు.

Muharram Tragedy in UP: మొహర్రం ఊరేగింపులో తీవ్ర విషాదం, లైవ్ హైటెన్షన్ వైర్ తగిలి బాలుడు అక్కడికక్కడే మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గురువారం ముహర్రం ఊరేగింపు సందర్భంగా లైవ్ హైటెన్షన్ వైర్ తగిలి ఒక బాలుడు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన కాన్పూర్‌లోని బెనజాబర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడు 17 ఏళ్ల సైఫ్‌గా గుర్తించారు.

Advertisement

US Shocker: వీడియో ఇదిగో, ఫ్యామిలీ రెస్టారెంట్‌లో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిన లవర్స్, వీడియో తీసిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు, ఇద్దరూ అరెస్ట్..

Hazarath Reddy

అమెరికాలోని జార్జియాలో మెక్సికన్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో కపుల్స్ రొమాన్స్ చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రేమికులు రెస్టారెంట్‌కు వెళ్లి.. అందరూ చూస్తుండగానే అక్కడ శృంగారం చేశారు. దీంతో అక్కడ ఇతర టేబుళ్లలో భోజనం చేస్తున్న వారంతా అవాక్కయ్యారు. వీరి నిర్వాకాన్ని ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Video: యూపీలో దారుణం, వరదలకు గ్రామంలోకి కొట్టుకు వచ్చిన మొసలిని విద్యుత్ స్తంభానికి కట్టేసి చిత్రహింసలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో, వరద నీటిలో కొట్టుకుపోయిన తరువాత గ్రామానికి చేరుకున్నమొసలిని గ్రామస్తులు ఒక విద్యుత్ స్తంభానికి తాడుతో కట్టివేసి చిత్రహింసలకు గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leopard Spotted in Andhra Pradesh: వీడియో ఇదిగో, శ్రీశైలం టెంపుల్ టోల్ గేట్ దగ్గర కుక్కను నోట కరుచుకుని వెళ్లిన చిరుతపులి

Hazarath Reddy

జూలై 10వ తేదీ బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం ఆలయ టోల్ గేట్ సమీపంలో చిరుతపులి కుక్కను వేటాడిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. భక్తులు వీడియో రికార్డు చేయడం చూసిన తర్వాత అడవి పిల్లి అడవిలోకి వెళ్లిపోయింది.

Telangana Shocker: సూర్యాపేటలో దారుణం, అర్థరాత్రి గంజాయి మత్తులో యువకుడిని చితకబాదిన మరో నలుగురు యువకులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో నలుగరు యువకులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో సూర్యాపేట టౌన్ లో గంజాయి బ్యాచ్ యువకుడిని చావబాదుతూ వీరంగం సృష్టించారు. రోడ్డు పై వెళుతున్న యువకుడిని చితకబాదుతూ హల్ చల్ చేశారు

Advertisement

Uttar Pradesh: గుండెలు పిండేసే ఘటన, రవాణా సదుపాయం లేక సోదరి మృతదేహాన్ని 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన అన్నదమ్ములు, హృదయవిదారక వీడియో ఇదిగో..

Hazarath Reddy

లఖింపూర్ ఖేరీ జిల్లాలో వరదల కారణంగా పరిస్థితి తీవ్రంగా ఉంది. వరదల మధ్య నిస్సహాయతకు గురైన హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది. సరైన చికిత్స అందక ఓ యువతి మృతి చెందింది. మరణానంతరం, సోదరులు గ్రామానికి చేరుకునేలోపు సోదరి మృతదేహాన్ని భుజాలపై వేసుకుని ఐదు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

Hyderabad: తీవ్ర విషాదం, ఈత కొడుతుండగా స్విమ్మింగ్ పూల్‌లో పడిన కరెంట్ తీగ, విద్యుత్ షాక్ కొట్టి 16 మందికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

Hazarath Reddy

నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని ఓ ఫాంహౌస్‌కు వెళ్లారు.సాయంత్రం సమయంలో ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ లోకి 16 మంది దిగారు. ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవడంతో వీరంతా గాయపడ్డారు

Tree Branch Fell on Woman: షాకింగ్ వీడియో ఇదిగో, తిరుమలలో నడుస్తుండగా పై నుంచి యువతిపై విరిగిపడిన కొమ్మ, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు..

Hazarath Reddy

తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో ఆమె తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Give Birth to Healthy Baby.. Take Money: పండంటి బిడ్డను కనండి.. 92 వేలు అందుకోండి.. దేశంలో సంతానోత్పత్తిని పెంచడానికి రష్యా సర్కారు ఆఫర్‌

Rudra

దేశంలో జననాలరేటును పెంచడానికి రష్యా చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా దేశ వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్‌ ఆఫ్‌ కరేలియా అధికారులు ఒక బంపర్ ఆఫర్‌ ను ప్రకటించారు.

Advertisement

Nepal Bus Tragedy: నేపాల్ లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడటంతో నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు.. 65 మంది గల్లంతు (వీడియోలతో)

Rudra

పొరుగు దేశం నేపాల్‌ లో ఘోరం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి.

Special Leaves in Assam: అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు.. ఎందుకో మీకు తెలుసా?

Rudra

ప్రభుత్వ ఉద్యోగులకు అస్సాం ప్రభుత్వం రెండు రోజులు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. నవంబర్‌ 6, 8 తేదీల్లో ఈ స్పెషల్ క్యాజువల్‌ లీవ్‌ లు ఇస్తున్నట్టు తెలిపింది.

Heart Attack: గుండెపోటు ముప్పును నెల ముందే ఈ 6 హెచ్చరికలతో ఈజీగా కనిపెట్టొచ్చు! ఏంటవి??

Rudra

ఆధునిక జీవనశైలి, ఆహారపుటలవాట్లలో మార్పులతో నేటికాలంలో గుండెజబ్బులు తీవ్రమయ్యాయి. దేశంలో ఏటా 30 వేల మంది గుండెపోటుకు బలవుతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గుండెపోటును ముందస్తుగా గుర్తించకపోవడంతోనే మరణాలరేటు ఎక్కువవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

Laugh Once a Day: ఆ దేశంలో రోజుకు కనీసం ఒక్కసారైనా పగలబడి నవ్వాల్సిందే.. అక్కడ కొత్త రూల్ ఇదే.. గుండె సమస్యలు తగ్గడం కోసమేనట.. అసలేంటి విషయం?

Rudra

రోజులో కనీసం ఒక్కసారైనా బిగ్గరగా నవ్వాలట. అలా ఉత్తర జపాన్‌ లోని యమగటా స్థానిక యంత్రాంగం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రజలందరూ రోజులో కనీసం ఒక్కసారైనా పగలబడి నవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement