Viral
Ramadan 2024 Date in India: కనిపించిన నెలవంక, మార్చి 12 తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లింలు, సందడిగా మారిన హైదరాబాద్‌ పాతబస్తీ
Hazarath Reddyమార్చి 11, 2024, సోమవారం నాడు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నెలవంక కనిపించింది. దేశంలోని ముస్లింలు మార్చి 12 నుండి ఉపవాసం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు.
Delhi Horror: ఢిల్లీలో వ్యాపారవేత్తను బంధించి అసహజ సెక్స్‌కు పాల్పడిన కామాంధులు, నకిలీ డీఆర్‌ఐలు అవతారమెత్తి ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్, నిందితులు అరెస్ట్
Hazarath Reddyఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) ఇన్‌స్పెక్టర్ల మంటూ కొరియర్ వ్యాపారిని 2 రోజుల పాటు బందీగా ఉంచి, జైలు శిక్ష విధిస్తామని బెదిరించి రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేశారు. అంతేకాకుండా అసహజ శృంగారానికి పాల్పడ్డారు.
Karnataka Shocker: ఫామ్‌హౌస్‌లో 25 మానవ పుర్రెలు, వందల కొద్దీ ఎముకలు, కర్ణాటకలో సంచలనం రేపుతున్న ఘటన, ఒకరు అరెస్ట్
Hazarath Reddyకర్ణాటకలోని రామనగర జిల్లాలోని జోగర దొడ్డి గ్రామ సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో సుమారు 25 మానవ పుర్రెలు, వందల కొద్దీ ఎముకలు బయటపడటంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. సమీపంలోని శ్మశానవాటికలో పుర్రెలను పూజిస్తున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో బిడాడి పోలీసులు బలరాంను అదుపులోకి తీసుకున్నారు
PM Modi Announces 'Mission Divyastra': మిషన్ దివ్యాస్త్రను ప్రకటించిన ప్రధాని మోదీ, DRDO శాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణమని కొనియాడిన భారత ప్రధాని
Hazarath Reddyడీఆర్‌డీఓ ద్వారా మిషన్ దివ్యాస్త్రను ప్రధాని మోదీ ప్రకటించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి యొక్క మొదటి ఫ్లైట్ టెస్ట్ మిషన్ దివ్యాస్త్ర కోసం కృషి చేస్తున్న మా DRDO శాస్త్రవేత్తలకు గర్వకారణమని కొనియాడారు.
Mission Divyastra: మిషన్ దివ్యాస్త్రను ప్రకటించిన ప్రధాని మోదీ, భారత్‌లో తొలిసారిగా అగ్ని-5 క్షిపణి ప్రయోగాత్మక పరీక్షలు
Hazarath Reddyస్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని భారత్‌లో తొలిసారిగా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు . X లో ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో, మిషన్ దివ్యాస్త్ర కోసం DRDO శాస్త్రవేత్తలను ప్రధాని ప్రశంసించారు .
Telangana: పొలంలో కరెంట్ వైర్ రిపేర్ చేస్తుండగా రైతుకు విద్యుత్ షాక్, తలకిందులుగా వేలాడుతున్న అన్నదాతను కాపాడిన స్థానికులు
Hazarath Reddyతెలంగాణలోని రంగల్ జిల్లా లో గల నెక్కొండ మండలం దొడి తండాలో శ్రీను(40) రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య వచ్చింది. దీంతో శ్రీను స్తంభం పైకి ఎక్కి జంపర్‌ను మార్చుతుండగా విద్యుత్ సరఫరా అవడంతో షాక్ కొట్టి స్తంభంపై తల కిందులయ్యాడు. అక్కడ ఉన్నవారు వెంటనే గమనించి ఆ రైతును కాపాడారు.
Cotton Candy Banned in Tamil Nadu: మిఠాయిలో క్యాన్సర్‌ కారకాలు, దూదితో కూడిన పంజు మిట్టాయ్‌పై నిషేధం విధించిన తమిళనాడు ప్రభుత్వం
Hazarath Reddyమిఠాయిలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు కనుగొనడంతో తమిళనాడులో దూది విక్రయాలపై నిషేధం విధించారు. తమిళనాడులోని పంజు మిట్టాయ్ అని పిలిచే దూదిలో ఈ హానికరమైన పదార్థాలు ఉన్నట్లు ఆహార భద్రత అధికారులు ధృవీకరించిన రెండు రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల మొదట్లో పుదుచ్చేరిలోనూ ఇదే తరహా నిషేధం విధించారు.
Hyderabad Shocker: ఫ్రీగా టిఫిన్ పెట్టలేదని హోటల్ యజమానురాలిపై దాడి చేసిన మందుబాబు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో రాజు యాదవ్ అనే యువకుడి తనకు ఫ్రీగా టిఫిన్ ఇవ్వలేదని హోటల్ యజమానురాలిపై హెల్మెట్, వాటర్ బాటిల్‌తో దాడి చేశాడు. అడ్డు వచ్చిన కానిస్టేబుల్ శశికాంత్ రెడ్డిపై సైతం పిడుగుద్దులతో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Accident Caught on Camera: షాకింగ్ రోడ్డు యాక్సిడెంట్ సీసీ పుటేజీ ఇదిగో, రోడ్డు పక్కన వెళుతున్న ముగ్గురిని వెనక నుంచి వేగంగా గుద్ది వెళ్ళిన కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyసోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. యూపీలోని గోరఖ్‌పూర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 3 మంది వ్యక్తులు వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో గాలిలోకి విసిరివేయబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒళ్లు ఝలదరించేలా ఉంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
Yogi Adityanath Deepfake Video: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్, డయాబెటిక్‌ ఔషధానికి ప్రచారం చేస్తున్నట్లుగా మార్ఫింగ్, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) డీప్‌ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డయాబెటిక్‌ ఔషధానికి ప్రచారం చేస్తున్నట్లు మార్పింగ్ వీడియో క్రియేట్ చేశారు.
Bengaluru Water Crisis: రాహుల్ జీ.. బెంగుళూరు నీటి సంక్షోభంతో నా స్నేహితుడికి పెళ్లి కావడం లేదు, వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ ఓ నెటిజన్ వినతి
Hazarath Reddyరాహుల్ జీ దయచేసి గమనించండి, Bengaluru Water Crisis పరిష్కరించడానికి ప్రాధాన్యతపై అవసరమైన పని చేయండి. నా స్నేహితుడు ఒకరు బెంగుళూరులో IT పరిశ్రమలో పని చేస్తున్న తన ప్రస్తుత అనుభవాన్ని పంచుకున్నారు, అతను పెళ్లి కోసం చూస్తున్నాడు, కాని నీటి సమస్య కారణంగా అమ్మాయిలు ఎవరూ బెంగళూరు ఉద్యోగితో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేరని తెలిపారు.
Siddham Sabha Trending in X: ఎక్స్‌ను ఊపేసిన సీఎం జగన్ సిద్ధం సభ, ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థా­నంలో నిలిచిన వైఎస్‌ జగన్‌ ఎగైన్, వైనాట్‌ 175, సిద్ధం హ్యాష్‌ ట్యాగ్‌లు
Hazarath Reddyబాపట్ల జిల్లాలోని మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నిర్వహించిన ‘సిద్ధం’ సభ సోషల్ మీడియాని ఊపేసింది. ఎక్స్‌ (ట్వి­ట్టర్‌)­లో వైఎస్‌ జగన్‌ ఎగైన్, వైనాట్‌ 175, సిద్ధం హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థా­నంలో నిలిచాయి. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్‌ ప్రసంగాన్ని ‘ఎక్స్‌’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించారు.
Lemon Sold for Rs 35,000: శివుడికి సమర్పించిన నిమ్మకాయను వేలంలో రూ.35 వేలకు సొంతం చేసుకున్న భక్తుడు, తమిళనాడు పఠపూశయన్‌ దేవాలయంలో వేలంపాట
Hazarath Reddyమహాశివరాత్రి సందర్భంగా శివుడికి సమర్పించే ఒక్క నిమ్మకాయను తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని గ్రామంలోని ఓ ప్రైవేట్ ఆలయంలో వేలం పాటలో రూ. 35,000కు (Lemon Sold for Rs 35,000) విక్రయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Pak- Death Sentence For WhatsApp Post: మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు, 22 ఏళ్ల యువకుడికి మరణశిక్ష విధించిన పాకిస్తాన్ కోర్టు
Hazarath Reddyమహ్మద్ ప్రవక్త, అతని భార్యలను కించపరిచే పదాలతో కూడిన ఫోటోలు మరియు వీడియోలను వాట్సాప్‌లో షేర్ చేసినందుకు గాను 22 ఏళ్ల విద్యార్థికి పాకిస్థాన్ కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో భాగంగా 17 ఏళ్ల మరో యువకుడికి జీవిత ఖైదు కూడా పడింది.
Free LPG Cylinders: మ‌హిళ‌ల‌కు యూపీ ప్ర‌భుత్వం హోలీ కానుక.. ఏడాదికి రెండు సిలిండర్లు ఉచితం.. రాష్ట్రంలోని సుమారు 1.75 కోట్ల మంది వినియోగ‌దారుల‌కు ల‌బ్ధి
Rudraనిరుపేద మహిళలు, వారి కుటుంబాలకు హోలీ కానుకగా ఉచిత ఎల్‌పీజీ సిలిండర్‌ ను అందించేందుకు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
Viral Video: గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి.. ఉత్తరప్రదేశ్‌ లో ఘోరం (వీడియో)
Rudraఉత్తరప్రదేశ్‌, ఫిరోజాబాద్ న‌గ‌రంలోని హన్స్‌ వాహిని పాఠశాలలో శనివారం ఘోరం జరిగింది. మధ్యాహ్నభోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటుండగా చంద్రకాంత్(8) అనే రెండో తరగతి చదువుతున్న బాలుడు గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.
Prabhas, Allu Arjun Fans: ప్రభాస్ అభిమానిని రక్తం వచ్చేలా కొట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. బెంగుళూరులో ఘటన.. వీడియో వైరల్
Rudraబెంగళూరులో అల్లు అర్జున్ అభిమానులు హల్ చల్ సృష్టించారు. ఓ పది మంది బన్నీ ఫ్యాన్స్ కలిసి ప్రభాస్ అభిమానిని రక్తం వచ్చేలా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Free Electricity to Schools: ప్రభుత్వ పాఠశాలలకు , ప్రభుత్వ కాలేజీలకు ఉచిత విద్యుత్.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ కాలేజీలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Naked Doctor: ఒంటి మీద నూలుపోగులేకుండా ప్రభుత్వాసుపత్రిలో కలియదిరిగిన వైద్యుడు .. హడలిపోయి పరుగులు తీసిన రోగులు, వారి బంధువులు.. మహారాష్ట్రలో ఘటన.. వీడియో వైరల్
Rudraమహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్ లోని బిడ్కిన్ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ప్రభుత్వ వైద్యుడు ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా ఆసుపత్రిలో తిరుగుతూ అందరినీ హడలగొట్టాడు.