వైరల్

Ravi Ashwin Retires: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, టెస్టు కెరీర్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా రికార్డు

Hazarath Reddy

టీమిండియా ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికారు. బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జ‌రిగిన మూడ‌వ టెస్టు చివ‌రి రోజు అశ్విన్ త‌న రిటైర్మెంట్ ప్ర‌క‌టించేశాడు.

Air India Retires Boeing 747: వీడియో ఇదిగో, చరిత్ర పుటల్లోకి బోయింగ్ 747 విమానాలు, ముంబై నుంచి వెళ్లే ముందు వింగ్ వేవ్ విన్యాసాన్ని ప్రదర్శించిన ఆఖరి విమానం

Hazarath Reddy

ఎయిర్ ఇండియా తన మిగిలిన నాలుగు బోయింగ్ 747 విమానాలను విరమించుకుంది. ఈ నేపథ్యంలో ముంబయి విమానాశ్రయ పరిసరాల్లో నివసిస్తున్న ముంబై వాసులు ఈ సంవత్సరం చాలా అరుదైన దృశ్యం ఒకటి చూశారు. ఎయిరిండియా రంగులతో కూడిన భారీ బోయింగ్ 747 టేకాఫ్ అయింది,

Viral Video: శిశువుకి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్.. చలనం లేకుండా పుట్టిన శిశువుకి సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన వైద్యుడు...వీడియో ఇదిగో

Arun Charagonda

ఎలాంటి చలనం లేకుండా పుట్టిన ఓ శిశువుకి ఓ వైద్యుడు సీపీఆర్ చేసి బతికించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఎలాంటి కంగారు పడకుండా బిడ్డను కాపాడేందుకు చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ఆ డాక్టర్‌పై మాత్రం నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Telangana: రోడ్డుపై డబ్బుల కట్టలు విసిరేసిన యువకుడు, కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ - ఘట్‌కేసర్ పరిధిలోని ఆర్ఆర్ఆర్ వద్ద ఓ యువకుడు రూ.20 వేలు రోడ్డు పక్కన విసిరేసి, వీడియో చూసినవారు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్‌గా మారి

Advertisement

Uttarakhand: వైరల్‌ వీడియో...రోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న యువతులు, ఉత్తరాఖండ్‌లో ఘటన, సోషల్ మీడియా ట్రెండింగ్‌లో వీడియో

Arun Charagonda

ఉత్తరాఖండ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఇద్దరు యువతులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. యువతుల ఫైట్‌ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియాల్సి ఉంది.

Viral Video: వయనాడ్ విధ్వంసం...కోతి తన పిల్లను ఎలా కాపాడుకుందో చూడండి...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కేరళలోని వయనాడ్‌ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. వయనాడ్ విధ్వంసంతో కేరళ అతలాకుతలం అయింది. వయనాడ్ విధ్వంసం తరువాత.. ఒక కోతి తను కన్న కోతిపిల్లను కాపాడుతున్న విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Hazarath Reddy

కీసరలోని మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల(సనత్‌నగర్, కూకట్‌పల్లి) పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను, ఖమ్మంలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థినిని ఎలుకలు కరిచాయి

Reel Gone Wrong: వీడియో ఇదిగో, పవిత్రమైన హరిద్వార్‌లో అశ్లీల కంటెంట్‌తో రీల్ వీడియో, 5 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

హరిద్వార్ గంగా, రూర్కీ గంగానహర్ వంతెనలపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ, అశ్లీలమైన కంటెంట్‌ను సృష్టించిన వీడియో వైరల్ కావడంతో ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలతో కూడిన ఈ గ్రూప్, సోషల్ మీడియాలో 528K ఫాలోవర్లను సంపాదించిన అనుచితమైన కంటెంట్, ప్రమాదకర చర్యలతో కూడిన రీల్స్‌ను తయారు చేసింది

Advertisement

Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటూ నినదించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ వంతపాడిన మంత్రి పొన్నం ప్రభాకర్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినదించారు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ బీఆర్ఎస్ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ వంత పాడారు.

Telangana: పబ్జి గేమ్ ద్వారా పరిచయమైన యువకుడు మాటలు నమ్మి ఆన్‌లైన్‌లో రూ. 3 లక్షలు బెట్టింగ్, మోసపోయానని తెలుసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Hazarath Reddy

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు యువకుడు బలయ్యాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండవుతాపురం గ్రామానికి చెందిన మరుపట్ల హనూక్(25) అనే యువకుడికి పబ్జి గేమ్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు.

Telangana: వీడియో ఇదిగో, ఓవర్ టేక్ చేయబోయి లారీ, బస్సు మధ్యలో పడ్డ బైకర్, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు

Hazarath Reddy

తెలంగాణలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి పట్టణంలో గణేష్ చౌక్ వద్ద ఓ బైకర్ అతి వేగంగా వెళ్లి లారీ, బస్సు మధ్యలో ఇరుక్కుపోయాడు. మజూద్ అనే యువకుడు బైక్ అతి వేగంగా నడుపుతూ లారీ బస్సు మధ్యలోకి దూసుకువెళ్లాడు, అయితే అదుపుతప్పి పడిపోయాడు.

Chain Snatching in Guntur: వీడియో ఇదిగో, తాడేపల్లిలో ఐదు నిమిషాల్లోనే రెండు చోట్ల చైన్ స్నాచింగ్స్, రోడ్లపై వచ్చేందుకు వణికిపోతున్న మహిళలు

Hazarath Reddy

గుంటూరు జిల్లా తాడేపల్లి(Tadepalli)లో చైన్ స్నాచర్లు(Chain snatchers) రెచ్చిపోతున్నారు. తాజాగా తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి(Kothur Anjaneya Swamy Temple) సెంటర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మేడలో బంగారు గొలుసు(Gold Chain) లాక్కుని పారిపోయారు.

Advertisement

Dog Attack in Hapur: వీడియో ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడిని తీవ్రంగా కరిచిన పిట్‌బుల్ డాగ్, స్థానికులు తరిమినా వదలకుండా..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన దూకుడు కుక్కల జాతులపై ఆందోళన రేకెత్తించింది. రెసిడెన్షియల్ సొసైటీలో తన ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లవాడిపై పిట్‌బుల్ దాడి చేసిన వైరల్ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, 48 గంటల్లో బెల్ట్ షాపులన్నీ సీజ్ చేయకపోతే నేనే రంగంలోకి దిగుతా, ఎక్సైజ్ శాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Hazarath Reddy

ఏపీలో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది.ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ రూపంలో మళ్లీ పాత విధానం అమలులోకి వచ్చింది. తాజాగా మద్యం అమ్మకాలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

Vanuatu Earthquake: భూకంపం వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి, వనాటు తీరంలో వచ్చిన భూకంపానికి కార్లు ఎలా ఊగుతున్నాయంటే..

Hazarath Reddy

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, మంగళవారం వనాటు రాజధాని పోర్ట్ విలాలో 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది.

Accident Caught on Camera: వీడియో ఇదిగో, 17 ఏళ్ళ యువకుడు ర్యాష్ డ్రైవింగ్, కారు కింద ఇరుక్కుని చిన్న పిల్లాడు విలవిల, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో సోమవారం జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ సీసీటీవీలో రికార్డైంది, వేగంగా వెళ్తున్న కారు పాదచారులు, వాహనాలపైకి దూసుకెళ్లింది. 17 ఏళ్ల యువకుడు నడిపిన హ్యుందాయ్ శాంత్రో కారు.. 56 ఏళ్ల రాజేష్ కుమార్ కమ్రా మరియు అతని 7 ఏళ్ల మనవడు మన్నత్‌ పైకి దూసుకెళ్లింది. వారు వాహనం కింద పడిపోయారు.

Advertisement

Worli Horror: షాకింగ్ వీడియో ఇదిగో, చైనీస్ భేల్ తయారు చేస్తూ గ్రైండర్‌లో ఇరుక్కుపోయిన యువకుడు, నుజ్జు నుజ్జు అయి తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

ముంబైలోని వర్లీ ప్రాంతంలో విషాదకర సంఘటన జరిగింది, 19 ఏళ్ల సూరజ్ నారాయణ్ యాదవ్ రోడ్డు పక్కన ఉన్న చైనీస్ స్టాల్‌లో ఆహారాన్ని తయారు చేస్తున్నప్పుడు గ్రైండర్‌లో ఇరుక్కుపోయి నలిగి చనిపోయాడు. జార్ఖండ్‌కు చెందిన యాదవ్ ఇటీవల సచిన్ కొతేకర్ యాజమాన్యంలోని స్టాల్‌లో పని చేయడం ప్రారంభించాడు.

US School Shooting: అమెరికా స్కూల్‌ లో కాల్పుల మోత.. టీచర్‌ సహా ఐదుగురు విద్యార్థులు మృతి

Rudra

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. విస్కాన్సిన్‌ లోని మాడిసన్‌ లో ఉన్న అబండంట్‌ క్రిస్టియన్‌ స్కూల్‌ లో 12వ తరగతి విద్యార్థి తుపాకీతో విరుచుకుపడ్డాడు.

Vanuatu Earthquake: వనాటు తీరంలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం, విదేశీ రాయబార కార్యాలయ ఆఫీసు ఎలా వణికిందో వీడియోలో చూడండి

Hazarath Reddy

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, మంగళవారం వనాటు రాజధాని పోర్ట్ విలాలో 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంపం 10 కిలోమీటర్ల (6.2 మైళ్లు) లోతులో సంభవించింది.

Student Suicide in Hyderabad: నారాయణ స్కూల్ లో మరో విద్యార్థి ఆత్మహత్య.. హయత్ నగర్ లో ఘటన (వీడియో)

Rudra

నారాయణ స్కూల్స్ లో విద్యార్థులు ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్ లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
Advertisement