Accident In Kerala: కేరళలో బోల్తా పడ్డ వ్యాన్.. 8 మంది అయ్యప్ప భక్తులు మృతి
కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకెళుతున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న 40 అడుగుల గోతిలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు.
Thiruvananthapuram, Dec 24: కేరళలో (Kerala) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకెళుతున్న వ్యాన్ (Van) అదుపుతప్పి బోల్తా కొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న 40 అడుగుల గోతిలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కేరళ-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో (Kerala-Tamilnadu Border) ఈ ప్రమాదం జరిగింది.
మళ్లీ పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్.. వయసులో తనకంటే 13 ఏళ్లు చిన్నవాడితో నిఖా
మృతులంతా థేని అండిపెట్టికి చెందిన వాళ్లేనని పోలీసులు తెలిపారు. అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. శుక్రవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ప్రమాదానికి కారణం అతివేగమేనని ప్రాథమికంగా పోలీసులు పేర్కొన్నారు.
Eight Sabarimala pilgrims died when their vehicle met with an accident at Kerala-Tamil Nadu border near Kumily around 11 pm on Friday. The devotees, all hailing from Andipatti in Tamil Nadu, were returning after visiting Sabarimala Temple. #News9SouthDesk pic.twitter.com/vtewoVkTcF
— Jisha Surya (@jishasurya) December 24, 2022
(The above story first appeared on LatestLY on Dec 24, 2022 10:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

