Newdelhi, Dec 24: పాకిస్థాన్ (Pakisthan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మాజీ భార్య రెహామ్ ఖాన్ (Reham Khan) మరోసారి పెళ్లికూతురయ్యారు. ఆమె ఇటీవలే మోడల్, నటుడు మీర్జా బిలాల్ బేగ్ ను వివాహమాడారు. 49 ఏళ్ల రెహామ్ ఖాన్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఇటీవలే సియాటిల్ లో మీర్జా బిలాల్ బేగ్ (Mirza Bilal Baig) తో తన నిఖా (వివాహం) జరిగిందని రెహామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన తల్లిదండ్రులు, కుమారుడు పెళ్లిపెద్దలుగా వ్యవహరించారని తెలిపారు.
చైనాలో కరోనా ప్రళయం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్.. మరణాలపై అందని సమాచారం.. వీడియోతో
కాగా, నటుడు మీర్జా బిలాల్ బేగ్ రెహామ్ ఖాన్ కంటే 13 ఏళ్లు చిన్నవాడు. అయితే, రెహామ్ ఖాన్ కు ఇది మూడో పెళ్లి కాగా, బిలాల్ బేగ్ కు కూడా ఇది మూడో పెళ్లే. రెహామ్ ఖాన్.... తొలుత 1993లో ఇజాజ్ రెహ్మాన్ ను పెళ్లాడి 2005లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2015లో ఇమ్రాన్ ఖాన్ ను పెళ్లాడారు. అదే ఏడాది విడిపోయి సంచలనం సృష్టించారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Finally found a man who I can trust @MirzaBilal__ pic.twitter.com/nx7pnXZpO6
— Reham Khan (@RehamKhan1) December 23, 2022
— Reham Khan (@RehamKhan1) December 23, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)