Shooting (Credits: X)

Newdelhi, Oct 29: పంజాబ్‌ (Punjab) లోని భటిండాలో అందరూ చూస్తుండగానే దారుణం జరిగింది. దుకాణం బయట కూర్చుని ఫోన్ (Phone) చూస్తున్న యజమానిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అక్కడి సీసీటీవీ (CCTV) కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. బాధితుడు హర్జిందర్ సింగ్ జోహాల్ తన ‘అమృత్‌సరి కుల్చా’ షాపు బయట కూర్చుని ఉండగా బైక్‌ పై వచ్చిన దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతను మరణించాడు. నిందితులను గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల వెనకున్న కారణం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

Kerala Blast: వీడియో ఇదిగో, కేరళలో వరుసగా మూడు చోట్ల బాంబు పేలుళ్లు, ఒకరు మృతి చెందగా 30 మందికి పైగా తీవ్ర గాయాలు

Matthew Perry Dies: బాత్ రూంలో గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ నటుడు, తన ఇంట్లోనే అచేతనంగా కనిపించిన ఫ్రెండ్స్ సిరీస్ స్టార్ మాథ్యూ పెర్రీ

శబ్దం విని తొలుత టపాసులు అనుకున్నా

ఈ ఘటనపై జోహాల్ షాపులో పనిచేసే వర్కర్ మాట్లాడుతూ.. కాల్పుల శబ్దం విని తొలుత టపాసులు అనుకున్నానని పేర్కొన్నాడు. ఆ వెంటనే జోహాల్ గట్టిగా అరుస్తూ తనపై కాల్పులు జరుపుతున్నారని, వారిని పట్టుకోవాలని కేకలు వేశారని చెప్పాడు. తాను వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయారని తెలిపాడు.