Newdelhi, Aug 10: ఇదో అనూహ్యమైన కేసు. ఓ వివాదాస్పద స్థలం కేసులో తీర్పునిచ్చిన కలకత్తా హైకోర్టు (Calcutta High Court) న్యాయమూర్తి అనంతరం జరిగిన ఓ షాకింగ్ ఘటన (Shocking Situation) కారణంగా ఆ మరుక్షణమే తన తీర్పును (Verdict) వెనక్కు తీసుకున్నారు. దీనికి దేవుడే కారణమంటే నమ్ముతారా? అందుకే ఇప్పుడు ఈ ఘటన పెద్ద చర్చనీయాంశమవుతోంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన గోవింద్ మండల్, సుదీప్ పాల్ అనే వ్యక్తుల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదాస్పద స్థలంలో అకస్మాత్తుగా శివలింగం కనిపించగా ఈ ఘటన వెనుక సుదీప్ మండల్ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గోవింద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ గుప్తా ఇరు వర్గాల వాదనలూ విన్నారు. అనంతరం, శివలింగం తొలగించాలంటూ తీర్పు వెలువరించారు.
Kolkata judge reverses 'remove shivling' order as official recording verdict faints
An official of the Calcutta High Court fainted while registering a verdict announced by a judge. On seeing him faint, the judge, who had ordered the removal of a shivling took his judgment back pic.twitter.com/UUkxmmW1Aq
— The Contrarian 🇮🇳 (@Contrarian_View) August 9, 2023
అనూహ్యమైన మలుపు ఇదే
న్యాయమూర్తి జడ్జిమెంట్ ను నమోదుచేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడంతో కలకలం రేగింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి తన తీర్పును ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా, ఈ వివాదంపై హైకోర్టు కలుగజేసుకోదని, కింది కోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించారు.