Chennai, April 9: క్రిమినల్ డీఫమేషన్ కేసులో ఇటీవల రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ తీర్పిచ్చిన న్యాయమూర్తి నాలుక కోస్తానంటూ తమిళనాడు కాంగ్రెస్ నేత మణికందన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 153బీతో సహా మూడు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.
#WATCH | Tamil Nadu: "When we will come to power, we will chop off the tongue of the judge who delivered the verdict to send our leader Rahul Gandhi to jail," said Manikandan, Congress Dindigul district president during a protest organised by the party on April 6, 2023 pic.twitter.com/a2cO2jt4fm
— ANI (@ANI) April 8, 2023
కాగా, ఏప్రిల్ 6న తమిళనాడులోని దిండిగల్‌లో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్‌కు మద్దతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా మణికందన్ సూరత్ కోర్టు న్యాయమూర్తిని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ మేం అధికారంలోకి వచ్చాక.. రాహుల్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి నాలుక కోస్తాం’’ అంటూ కామెంట్స్ చేశారు.