Jodhpur, April 19: రాజస్తాన్ లోని జోధ్ పూర్ లో (Jodhpur) దారుణం జరిగింది. ఓ యువకుడు విదేశీ యువతిని వేధించాడు. ఒంటరిగా కనిపించిన ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన దుస్తులు విప్పి, ప్రైవేట్ పార్ట్స్ చూపించాడు. దీంతో ఆ యువతి భయపడిపోయింది. ఆ యువతిది కొరియా. ఆమె ఓ బ్లాగర్ (Korean Blogger). జోధ్ పూర్ లో పర్యటిస్తోంది. అక్కడి దృశ్యాలను తన క్యామ్ లో షూట్ చేస్తోంది. అదే సమయంలో స్థానిక యువకుడు ఒకడు అక్కడికి వచ్చాడు. కొరియన్ యువతిని (Korean Blogger) ఫాలో అయ్యాడు. యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఆ యువకుడు రెచ్చిపోయాడు. అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను ఫాలో అయిన యువకుడు.. ఓ చోట ఆగాడు. వికృతంగా నవ్వుతూ తన ప్రైవేట్ పార్ట్స్ (Private Parts) బయటకు తీసి చూపించాడు. అతడి వికృత చేష్టలతో కొరియన్ యువతి భయపడిపోయింది. భయంతో పరుగులు తీసింది. హెల్ప్ అంటూ గట్టిగా కేకలు వేసింది. తన చేతిలో ఉన్న క్యామ్ తో ఆ యువతి.. యువకుడి వికృత చేష్టలను రికార్డ్ చేసింది. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.
Just came across this video of a Korean vlogger who posted a video of her being sexually harassed in Jodhpur. This is extremely disgusting and shameful. People like these are spoiling the image of our great country. Am writing to Shri @AshokGehlot51 to take strongest action! pic.twitter.com/8vfjblcizx
— Swati Maliwal (@SwatiJaiHind) April 18, 2023
ఇదంతా పట్టపగలే జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ పెద్దగా జనసంచారం లేదు. దాంతో ఆ యువకుడు రెచ్చిపోయాడు. కొరియన్ యువతి భయంతో పరుగులు తీయగా.. ఆ యువకుడు కూడా ఆమె వెనకాలే పరిగెత్తాడు. కొంత దూరం తర్వాత ఆగిపోయాడు. లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోని కొరియన్ యువతి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఈ విషయం పోలీసులను చేరింది. వెంటనే వారు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. వీడియో ఆధారంగా వికృత చేష్టలకు పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
దీనిపై ఢిల్లీ ఉమెన్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ (Swathi maliwal) తీవ్రంగా స్పందించారు. ఇది చాలా బాధాకరమైన, దారుణమైన ఘటన అన్నారు. సిగ్గుతో తలదించుకునే సంఘటన అని వాపోయారు. ఇలాంటి కొందరు నీచుల వల్ల మన దేశం పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ నీచుడిని కఠినంగా శిక్షించాలని రాజస్తాన్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు స్వాతి మలివాల్.