బీహార్‌లో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ఓ మహిళా ఆఫీసర్‌పై ఇసుక మాఫియా దాడికి పాల్పడింది. ప్రాణ భయంతో పారిపోతున్న అధికారిణిని వెంబడించి రాళ్లు, మట్టిపెళ్లలతో కొట్టింది. ఆమెను కిందపడేసి నేలపై ఈడ్చింది. దాడి సమయంలో కొందరు ఆ అధికారణిని అసభ్య పదజాలంతో దూషించారు. పట్నా జిల్లాలోని బిహ్త్ పట్టణంలో ఇవాళ ఉదయం ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులుగా తేలిన వారిని అదుపులోకి తీసుకుంటున్నది. ఇప్పటి వరకు మొత్తం 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 44 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)