Bengaluru, March 3: అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ముందు బీజేపీకి (BJP) ఇబ్బంది కలిగించే ఘటన తాజాగా ఎదురైంది. కర్ణాటకలోని (Karnataka) చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప (Madal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ (Prashanth) మదల్ తన తండ్రి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 40 లక్షల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఆ సమయంలో ఆయన టేబుల్‌పై కుప్పలుగా పోసిన నగదుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (బీడబ్ల్యూఎస్ఎస్‌బీ)లో ప్రశాంత్ చీఫ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు.
BIG
K'taka Lokayukta sleuths have raided & trapped son of BJP MLA Madal Virupakshappa, the accused Prashanth works as Chief accountant in BWSSB, he was collecting bribe on behalf of his father/chairman KSDL for raw material procurement tender. Raids on at crescent road office. pic.twitter.com/5NWAbLDeId
— Deepak Bopanna (@dpkBopanna) March 2, 2023