Credits: Twitter/ANI

Pune, April 9: వేసవిలో అందరికీ మామిడి పండ్లు తినాలనిపిస్తుంది. కానీ, వీటి ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎంత ఇష్టమున్నా మామిడి పండ్లు తినలేకపోతున్నారు సామాన్య ప్రజలు. అందుకే, పుణెకు చెందిన గౌరవ్‌ అనే ఓ పండ్ల వ్యాపారి సెల్‌ఫోన్లు, వాహనాల లాగానే మామిడి పండ్లను ఈఎంఐ పద్ధతిలో విక్రయిస్తున్నాడు. మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలో అల్ఫోన్సో రకం మామిడి పండ్లు పండుతాయి. వీటి రుచి అద్భుతంగా ఉంటుంది. దీనికి తగ్గట్టే ధర కూడా ఉంటుంది. డజన్‌ పండ్లు రూ.800 నుంచి రూ.1300 వరకు పలుకుతున్నవి. దీంతో మామూలు ప్రజలు కొనలేని పరిస్థితి. అందుకే గౌరవ్‌ ఈఎంఐ పద్ధతిని ప్రవేశపెట్టాడు.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పిచ్చిన జడ్జి నాలుక కోస్తాం..కాంగ్రెస్ నేత మణికందన్‌ వివాదాస్పద వ్యాఖ్య.. కేసు పెట్టిన పోలీసులు

కనీసం రూ.5000 విలువైన పండ్లు కొనుగోలు 

అయితే, కనీసం రూ.5000 విలువైన పండ్లు కొనుగోలు చేయాలని షరతు విధించారు. క్రెడిట్‌ కార్డు మీద ఈఎంఐ ఉంటుందని, 3, 6, 12 నెలల వాయిదాల్లో చెల్లించవచ్చని చెప్తున్నాడు.

Corona Virus: కరోనా కారణంగా గుండెపోటు ముప్పుతో పాటు ఇంకా ఎన్నో జబ్బులు.. వైద్య నిపుణుల హెచ్చరిక