Russian Military. (Photo Credits: Twitter)

Mascow, SEP 29:  ఉక్రెయిన్‌ తో యుద్ధం (Ukrain War) నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. ఉక్రెయిన్ యుద్ధం కోసం పెద్ద ఎత్తున సైన్యాన్ని సమీకరించాలని పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బలవంతంగా మిలటరీలో చేరాలన్న ఆర్టర్స్ పై (Military Mobilization) ఆందోళన వ్యక్తం అవుతోంది.

దీని నుంచి తప్పించుకునేందుకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. కొందరు టూరిజం వీసాలతో బయటిదేశాలకు వెళ్తున్నారు. మరికొందరు కావాలని అనారోగ్యం పాలవుతున్నారు. అయితే పలువురు యువకులు తమను తామే అంగవైకల్యులుగా మార్చుకుంటున్నారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుంటున్నారు (Breaking Body Parts). యుద్ధంలోకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే...అంగవైకల్యం మేలు అని భావిస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా (Viral) మారుతున్నాయి.

అయితే పుతిన్ నిర్ణయంపై ఇతర దేశాలు మండిపడుతున్నారు. రైతులను కూడా సైన్యంలో చేరాలంటూ ఆర్డర్స్ ఇవ్వడం సరికాదని, దీని వల్ల ఆహార కొరత వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే పుతిన్ కూడా ఆర్మీ మొబిలైజేషన్ లో కొన్ని సవరణలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పౌర తిరుగుబాటుకు కారణం కాకముందే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు పుతిన్ సన్నిహితులు.

ఉక్రెయిన్‌పై దాడులను (Ukraine Crisis) తీవ్రతరం చేస్తోన్న రష్యాలో నిర్బంధ సైనిక సమీకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. కేవలం గతంలో సైనిక శిక్షణ తీసుకున్న వారినే కాకుండా వివిధ వర్గాల పౌరులను కూడా ఇందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రైతులను కూడా సైన్యంలో చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తాజాగా వెల్లడైంది. యుద్ధం కారణంగా పలు దేశాలు ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న వేళ.. తాజా నిర్ణయం దీనికి మరింత ఆజ్యం పోసే సూచనలు కనిపిస్తున్నాయి.

‘వ్యవసాయ సంస్థలు, ప్రాంతీయ అధిపతులతోనూ సమావేశం అవ్వాలనుకుంటున్నాను. సైనిక సమీకరణలో భాగంగా వ్యవసాయ కూలీలను కూడా సిద్ధం చేస్తున్నాం. వారి కుటుంబాలు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నా’ అని ఉన్నతాధికారులతో తాజాగా జరిగిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు.

సైన్యంలో పనిచేసేందుకు రైతులను కూడా సిద్ధం చేస్తామని పుతిన్‌ పేర్కొనడం పంట పనుల్లో బిజీగా ఉన్న రైతులకు ఆందోళన కలిగించేదిగా కనిపిస్తోంది. మరోవైపు నిర్బంధ సైనిక సమీకరణపై రష్యా పౌరుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పుతిన్‌ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తోన్న పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అందులో కొంత మంది పురుషులకు సైన్యంలో చేరాలంటూ నోటీసులు ఇస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటివరకు లక్ష మందికిపైగా దేశం విడిచి వెళ్లిన్నట్లు సమాచారం.