Newyork, Oct 29: అమెరికాలో (America) ఓ మహిల దారుణ హత్యలకు పాల్పడింది. శృంగారం (Sex) కోసం వచ్చే పురుషుల్ని చంపేసింది. రెబెక్కా ఆబోర్న్ అనే 33 ఏళ్ల మహిళ, పురుషులతో (Men) సెక్స్ తర్వాత వారికి ప్రాణాంతక మత్తుపదార్థాలు ఇచ్చి చంపేసేది, ఆ తరువాత వారిని దోచుకునేది. ఇలా నలుగురిని హత్యలు చేసిన రెబెక్కాపై పోలీసులు బుధవారం అభియోగాలు మోపారు. ఒహియోలోని కోలంబస్ లో సెక్స్ లో పాల్గొన్న పురుషుల వరస హత్యలు జరిగాయి. దీని వెనక ఒహియోకు చెందిన రెబెక్కా ఆబోర్న్ ఉన్నట్లు ఓహియో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్ తెలిపారు. ఒక బిడ్డకు తల్లైన రెబెక్కా నలుగురిని మత్తుమందు ఇచ్చి చంపేసి, ఆ తర్వాత దోచుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఈ ఏడాది నాలుగు హత్యలు చేసింది.
#Ohio woman arrested for serial murders of men she met for sex https://t.co/YMEvPiVdLw
— IndiaToday (@IndiaToday) October 28, 2023
ఎలా సమాచారం లభించిందంటే?
అంతకుముందు ఏడాది డిసెంబర్ నెలలో ఓ వ్యక్తికి హైడోస్ డ్రగ్స్ ఇచ్చేందుకు ప్రయత్నించిన సమయంలో అతను దాడి నుంచి బయటపడ్డాడని యోస్ట్ తెలిపారు. ఆబోర్న్ బారిన పడిన వ్యక్తులు ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉందని ఆయన అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రాణాలతో బయటపడిన వారు ఈ కేసులో ముందుకు రావాలని కోరారు. హైడోస్ మరణాలు వరుసగా జరుగుతున్న క్రమంలో ఓ కీలక సమాచారం లభించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.