Thunderstorms In Odisha: ఒడిశాలో పిడుగుల వాన.. అరగంటలో 5,450 పిడుగులు.. ఐదుగురి మృతి.. భద్రక్ జిల్లా బాసుదేవపూర్‌లో ఘటన.. పిడుగుపాటు శబ్దాలతో జనం బెంబేలు.. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇలానే జరుగుతుందన్న అధికారులు
Representational Picture

Bhadrak, March 31: ఒడిశాలో (Odisha) పిడుగుల వాన (Thunderstorms Rain) కురిసింది. అరగంటపాటు ఏకధాటిగా కురిసిన పిడుగులతో జనం బెంబేలెత్తిపోయారు. అరగంట వ్యవధిలో ఏకంగా 5,450 పిడుగులు (Thunderstorms) పడ్డాయి.  తెరిపిలేకుండా పడిన ఈ పిడుగుల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రక్ (Bhadrak) జిల్లా బాసుదేవపూర్‌లో బుధవారం సాయంత్రం జరిగిందీ ఘటన.  ఆగకుండా వస్తున్న 5,450 పిడుగుపాటు శబ్దాలకు ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే, ఇలా జరగడం కొత్తేమీ కాదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్టు గోపాల్‌పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (ఐఎండీ) అధికారులు చెబుతున్నారు. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇలా జరుగుతుందని అన్నారు.

Vande Bharat Express: కేవలం 8.30 గంటల్లోనే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి.. వందేభారత్‌ లో రయ్.. రయ్.. టైమింగ్స్‌ ప్రకటించిన రైల్వే శాఖ

ఈ జిల్లాల్లో వర్షాలు

సుందర్‌గఢ్, కియోంజర్, సుందర్‌గఢ్, మయూర్‌భంజ్, బాలాసోర్, కటక్ సహా పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ సమయంలో బలమైన గాలులు, పిడుగు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

New Parliament Building Pics: కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఫోటోలు చూశారా, ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక తనిఖీ, సోషల్ మీడియాలో పిక్చర్స్ వైరల్