Newyork, Dec 6: ఆర్థిక మాంద్యం, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా మొన్న మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter), నిన్న ఫేస్‌బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta), అమెజాన్ (Amazon), హెచ్‌పీ (HP), యాపిల్ (Apple) సహా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను వదిలించుకుంటున్న వార్తలను చదివాం. ఇప్పుడు ఈ జాబితాలో పెప్సీ కో (PepsiCo) వచ్చి చేరింది. నార్త్ అమెరికాలోని ‘పెప్సీ కో’ స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్‌లో వందలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్’ జర్నల్ పేర్కొంది.
ఉద్యోగులు అందుకున్న ఇంటర్నల్ మెమోలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. సంస్థను మరింత సులభతరంగా మార్చడంలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్ ఇస్తున్నట్టు తన కథనంలో పేర్కొంది. అయితే, పెప్సీ కో మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.
PepsiCo is laying off headquarters workers from its North American snack and beverage units, according to the Wall Street Journal https://t.co/bV4bL8111v
— Bloomberg (@business) December 5, 2022