London, Dec 6: ప్రముఖ ఇంగ్లిష్ డిక్షనరీ ‘ఆక్స్ ఫర్డ్’ (Oxford) 2022 సంవత్సరం పదంగా ‘గోబ్లిన్ మోడ్’ను (Goblin Mode) ప్రకటించింది. వర్డ్ ఆఫ్ ద ఇయర్ (Word Of The Year) ఎంపిక కోసం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం మొదటిసారి. గడిచిన రెండు వారాల్లో ఈ పోల్ లో (Poll) అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోబ్లిన్ మోడ్ పదానికి 3,00,000 మంది ఓటు (Vote) వేశారు. ఈ ఏడాదే ఎంతో ప్రాచుర్యంలో ఉన్న మెటావర్స్ (Metaverse) తో పాటు స్టాండ్ విత్, గోబ్లిన్ మోడ్ అనే మూడు పదాలను నిఘంటు శాస్త్రవేత్తలు తుదిగా ఎంపిక చేసి ప్రజల నుంచి అభిప్రాయాలను కోరారు. చివరగా ‘గోబ్లిన్ మోడ్’ వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైంది.
గోబ్లిన్ మోడ్ అంటే ఒక రకమైన ప్రవర్తనను చెప్పేందుకు ఉఫయోగించే పదం. అనాలోచితం, స్వీయ భావన, బద్ధకం, నిదానంగా, అత్యాశతో అనే అర్థాల కింద గోబ్లిన్ మోడ్ ను వాడుతుంటారు. ఈ పదం తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చింది.
The ‘goblin community’ has spoken!
We’re pleased to announce goblin mode as the #OxfordWOTY 2022.
Read more about this year’s winning choice here #TeamGoblinMode: https://t.co/NmC2UYau3U pic.twitter.com/yqQ9eIlIeQ
— Oxford University Press (@OxUniPress) December 5, 2022