Viral Video: డెలివరీ బాయ్ పురుషాంగాన్ని కొరికేసిన పెంపుడు కుక్క, అయ్యో పాపం అంటున్న నెటిజన్లు, వీడియో వైరల్...
పార్శిల్ ఇచ్చేందుకు వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్ పురుషాంగాన్ని ఓ పెంపుడు కుక్క కొరికిన తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆ డెలివరీ బాయ్ పరిస్థితి చూసి నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు.
పార్శిల్ ఇచ్చేందుకు వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్ పురుషాంగాన్ని ఓ పెంపుడు కుక్క కొరికిన తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆ డెలివరీ బాయ్ పరిస్థితి చూసి నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు.
పెంపుడు కుక్క దాడికి తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ ఘటన ఎక్కడ జరిగిందా అని ఆరా తీస్తే, ముంబైలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి స్థానిక మీడియాలో వచ్చిన కథనం ఇలా ఉంది.
Indian food delivery guy bitten by a woman's dog while on duty#ViralVideo #Viralnews pic.twitter.com/QjBphczP99
— లేటెస్ట్లీ తెలుగు (@LatestlyTelugu) September 11, 2022
ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోగా, ఆ పార్శిల్ ను తీసుకొచ్చిన డెలివరీ బాయ్ అతనికి ఇచ్చేందుకు కాలింగ్ బెల్ కొట్టాడు. పార్శిల్ పెట్టిన వ్యక్తి వచ్చి డోర్ తీశాడు. అయితే, అతని చేతిలో ఉన్న కుక్క ఆ డెలివరీ బాయ్ పై ఒక్కసారిగా దాడి చేసింది. అంతేకాదు ఏకంగా ఆ డెలివరీ బాయ్ పురుషాంగాన్ని టార్గెట్ చేసి, కరిచేసింది.
మరోవైపు ఆ కుక్క తాడును వెనక్కి లాగడంతో ఆ కుక్క కూడా వెనక్కి జరిగింది. కానీ డెలివరీ బాయ్ పురుషాంగాన్ని ఆ కుక్క నోటితో కరిచి పారేసింది. దీంతో అతనికి తీవ్ర రక్త స్రావమై ఏడుస్తూ ఉండడంతో అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
(The above story first appeared on LatestLY on Sep 11, 2022 04:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

