Credits: Twitter

2,000 రూపాయలు దొంగిలించారనే అనుమానంతో కొంతమంది  వ్యక్తులు ఇద్దరు యువకుల మలద్వారంలో కారం రుద్ది, పెట్రోల్ ఇంజెక్షన్లు ఇచ్చి, బలవంతంగా మూత్రం తాగించారని పోలీసులు ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లాలోని పత్రా బజార్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు మొత్తం ఎపిసోడ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది శనివారం వైరల్ అయ్యింది. ఈ విషయంలో చర్య తీసుకోవాలని పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ కుమార్ అగర్వాల్ ఆదేశించారు.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది 

ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ తెలిపారు. మైనర్ బాలురులో ఒకరైన అఫ్జల్ తండ్రి మహ్మద్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మంది వ్యక్తులపై పత్ర పోలీస్ స్టేషన్‌లో ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటన పత్ర బజార్‌లోని కొంకటి క్రాసింగ్‌ వద్ద ఉన్న చికెన్‌ షాపులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోళ్ల ఫారమ్‌లో రూ. 2,000 దొంగిలించారని ఆరోపిస్తూ నిందితులు ఇద్దరు అబ్బాయిలు - అఫ్జల్, విజయ్ సాహ్ని  చేతులు కట్టేశారు. అనంతరం వారికి పెట్రోలు ఇంజక్షన్లు వేసి మలద్వారంలో కారం పొడి వేశారు. బాలుర నోట్లో బలవంతంగా మూత్రం పోశారు. ఇద్దరు బాలురు సహాయం కోసం అరిచారు, కానీ వారిని రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆదివారం, దోమరియాగంజ్‌కు చెందిన బిజెపి ఎంపి జగదాంబిక పాల్ బాలురు చికిత్స పొందుతున్న జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనలో ఇంకా పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను గుర్తించాలని ఎస్పీకి సూచించామని శాసనసభ్యుడు విలేకరులతో అన్నారు.