సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు ప్రస్తుతం రిమాండ్ రిపోర్టును తయారు చేస్తున్నారు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ మామ, మరీ ఇలా బెడ్ రూం లోకి వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని బన్ని మండిపాటు, వీడియోలు ఇవిగో..

అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్, అరెస్టు నుంచి రక్షణ పిటిషన్ పై విచారణ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది హైకోర్టు. ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం అవుతాయని భావిస్తున్నారు. ఆయన గట్టిగా క్వాష్ పిటిషన్, అరెస్టు నుంచి రక్షణను వ్యతిరేకిస్తే న్యాయమూర్తి కూడా రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసుకోమని సూచించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ కేసులో చాలా గట్టిగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించలేదు.

Court gives green signal for hearing on Allu Arjun's quash petition!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)